Friday 26 September 2014

నెట్ శారీలో రెడ్ హాట్ గా కనిపించిన కాజల్ అగర్వాల్

తెలుగు టాప్ సెలబ్రెటీలలో ఒక్కరైన కాజల్ అగర్వాల్ రీసెంట్ గా ‘గోవింధుడు అందరి వాడు' ఆడియో లాంచ్ ఈవెంట్ కు చాలా డిఫరెంట్ లుక్ తో హాజరయ్యారు. అమ్రిత్ థాకూర్ డిజైన్ చేసి బ్లడ్ రెడ్ నెట్ శారీలో కనిపించి చాలా డిఫరెంట్ గా ఈవెంట్ లో అందరినీ ఆకర్షించారు.
శారీ చాలా డిఫరెంట్ గా బ్రైట్ కలర్ లో అందంగా డిజైన్ చేయబడింది. అంతే కాదు, కాజల్ అగర్వాల్ కూడా ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. ప్రముఖ డిజైనర్ అమ్రిత్ థాకూర్ కలెక్షన్స్ లో తాజా డిజైన్స్ లో ఇది ఒకటి. ఈ రెడ్ కలర్ శారీ మీద చాలా భారీగా ఎంబ్రాయిడరీ వర్క్ చేయబడింది. బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్ ధరించిన ఈ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ ఫర్ఫెక్ట్ గా అనిపించింది. అంతే కాదు, ఈ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ మీదకు ఆమె ధరించిన యాక్ససరీస్ కూడా ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. డైమండ్ రింగ్ మరియు బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ రెడ్ ప్లవర్ ఎంబ్రాయిడరీ శారీ మీదకు ఫర్ఫెక్ట్ గా అనిపించింది. ఇక హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఒక ట్రెడిషనల్ లుక్ అందించింది. మేకప్ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నా మ్యానేజబుల్ గా కనిపించింది. కాజల్ అగర్వాల్ నటించిన గోవిందుడు అందరి వాడు చిత్రం ఆడియో లాంచ్ లో ఇలా డిఫరెంట్ గా ట్రెడిషనల్ లుక్ తో కనిపించిన కాజల్ అగర్వాల్ లైట్ రెడ్ లిప్ కలర్ మరియు డల్ స్మోకీ ఎఫెక్ట్ తో ఐ మేకప్ తో చాలా అందంగా కనిపించింది. హెయిర్ స్టైల్ డిఫరెంట్ గా కనబడుతూ ఒక సైడ్ కు మాత్రమే కనబడే విధంగా స్టైలిష్ గా డిజైన్ చేయబడింది. అలాగే ఆమె శారీ మీదకు కాళ్ళకు బ్లాక్ సాండిల్స్ కూడా అందంగా కనిపించాయి. కాజల్ అగర్వాల్ చాలా డిఫరెంట్ గా కనబడుతున్నారు.


No comments:

Post a Comment