Thursday 16 October 2014

మోచేతి నలుపును తగ్గించే జామ

   
మోచేతులు, మోకాళ్ళ దగ్గర చర్మం నల్లగా, గట్టిగా ఉంటుంది. దీన్ని తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాం. కాని తగ్గించడం మాత్రం కష్టం. కాని వాటిని కూడా సహజమైన పదార్ధాలతో తగ్గించవచ్చని బ్యూటీషియన్లు అంటున్నారు. మరి, ఈ నలుపును దూరంచేసుకోవటానికి కావలసిన ఈ చిట్కాలను తెలుసుకుందాం.
ఒక జామకాయను తీసుకొని మిక్సీలో మెత్తగా, మృదువుగా అయ్యేలా చేసుకొని, దీనికి నిమ్మరసాన్ని కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మోచేతి, మోకాలిపై గల నలుపుకు ప్యాక్‌లా వేసి మర్ధన చేసి, పది నిమిషాల తర్వాత కడిగేయండి. ఆ తర్వాత మాయిశ్చరైజర్‌ను కొద్దిగా ఆప్రదేశంలో రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నలుపు తొలగిపోతుంది. 
పాలు, తేనె, పసుపును సమపాళ్లలో తీసుకొని ముద్దగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నలుపుదనం ఉన్న చోట రాసి పది నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో బాదం పౌడర్‌ను కూడా కలుపుకోవచ్చు.
నారింజ తొక్కను నీడలో ఎండబెట్టి పౌడర్‌లా తయారు చేసుకోవాలి. ఈ పొడి, పాలు సమంగా తీసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నలుపు ఉన్న మోకాలు, మోచేతులకి రాసుకొని పది నిమిషాల తర్వాత కడిగేయాలి. 

No comments:

Post a Comment