Monday 10 November 2014

చలికాలంలో డ్రై స్కిన్ నివారించేందుకు ఉత్తమ మార్గాలు

శీతాకాలంలో చలి మీ చర్మాన్ని పొడిబారేలా చేస్తోందా? ఇదే చలిగాలి ఎంతో హాయిగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ.. ఆ చలిగాలి చర్మాన్ని పొడిబారిపోయి అందవికారంగా తయారు చేస్తుంది. ఇలాంటి సమయంలో చర్మాన్ని కాపాడుకునేందుకు కొన్ని చిట్కాలు.. జాగ్రత్తలు తీసుకుంటే చర్మాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు చెపుతున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే స్కిన్
మాయిశ్చరైజ్ అయి కాంతులీనుతూ ఉంటుందని చర్మ వైద్య నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో దాహం ఎక్కువగా లేకపోవడం వల్ల నీళ్లు ఎక్కువగా తాగాలనిపించిదు. దీనివల్ల చర్మంలో తేమ శాతం తగ్గిపోయి పొడిబారుతుంది. దాహం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా నీళ్లు తాగుతూ ఉండాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను, పండ్ల రసాలను తీసుకున్నా మంచిదే. అటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అలాగే, చలికాలంలో వీలైనంత తక్కువగా సబ్బును ఉపయోగించడం మంచిది. పొడిచర్మం ఉన్నవాళ్లు పాలల్లో ఉలవపిండిని కలిపి మర్దనా చేస్తే చర్మం పొడిబారకుండా సున్నితంగా ఉంటుంది. అలాగే, గోరు నువ్వుల నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ మృదువుగా మర్దనా చేసినా మంచి ఫలితం దక్కుతుంది. తర్వాత సున్నిపిండితో స్నానం చేయాలి. దీనివల్ల మృతకణాలు రాలిపోవడమే కాదు చర్మం సున్నితంగా ఉంచుతుంది. శీతాకాలంలో డ్రై స్కిన్ నివారించడానికి బెస్ట్ ఫేస్ ప్యాక్స్: 
మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్‌వాటర్, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్ చేయింసుకోవడం మంచిది. చర్మం పగిలిపోయినట్లుగా ఉండేవారు స్నానానికి సబ్బును కాకుండా సున్నుపిండిని ఉపయోగిస్తే ఇంకా మంచిది. గ్లిజరిన్‌లో రోజ్‌వాటర్, తేనె కలిపి ఈ మిశ్రమాన్ని చేతులు, కాళ్లకు అప్లైచేయాలి. తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. తేనె, రోజ్ వాటర్, పాలపొడి కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. అరటిపండు, బొప్పాయి, యాపిల్ పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెపుతున్నారు. ఇలా మన ఇంటివద్దనే ఈ తరహా చిట్కాలు పాటిస్తే చర్మాన్ని కాపుడుకోవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. పొడిబారే సమస్య అధికమవుతుంటే కఠిన రసాయనాలతో తయారుచేసిన సబ్బులూ, సౌందర్య ఉత్పత్తులు వాడుతున్నారేమో పరీక్షించుకోండి. అవి చర్మంపై ఉన్న తేమను పీల్చుకుని, పొడిగా మారేందుకు కారణమవుతాయి. ఇలా జరగకుండా తరచూ ముఖం, చేతులూ కడుక్కోవాల్సి వచ్చినప్పుడు లిక్విడ్‌ సబ్బుల్ని ఉపయోగించండి. ఎక్కువసేపు నీళ్లలో నానినప్పుడూ ఈ సమస్య బాధిస్తుంది. నీటిలో క్లోరిన్‌ శాతం అధికంగా ఉన్నప్పుడు, అది తేమను పీల్చుకుంటుంది. దాంతో చర్మం పొడిబారు తుంది. అందుకే నీళ్లలో బాగా తడిసినప్పుడు రోజుకి ఒకసారయినా మాయిశ్చరైజర్‌ రాసుకుంటే మంచిది. తరచూ ఫ్రూట్‌ సలాడ్లూ, పండ్లరసాలూ, బార్లీ నీళ్ల వంటివి తీసుకుంటే చర్మం తాజాగా మారుతుంది. ఎక్కువగా ఎండలో తిరిగేవారిలోనూ ఈ ఇబ్బంది కనిపిస్తుంది. సూర్యుడి నుంచి నేరుగా పడే అతినీలలోహిత కిరణాలు చర్మాన్ని తాజాగా ఉంచే కొలాజిన్‌ ఉత్పత్తిని నిరోధిస్తాయి. ఫలితంగా ముడతలు పడటం, పొడిబారడం జరుగుతుంది. అందుకే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు సన్‌స్క్రీన్‌ లోషన్‌ను రాసుకోవాలి. 
పొడి చర్మం: హోం మేడ్ నేచురల్ ఫేస్ ప్యాక్:  తాజా ఆకుకూరలు, ఉసిరికాయలు, బొప్పాయి, అనాస వంటి పండ్లు ఖర్జూరాలు ఎక్కువగా తీసుకోవాలి. శీతాకాలంలో వ్యాయామం తప్పరిసరిగా చేయాలి. ఉదయం చలి తీవ్రత తగ్గిన తర్వాత 7-8గంటలకు నడకకు వెళ్లటం మంచిది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వాహనాలపై వెళ్లేవారు ముఖానికి హెల్మెట్‌ లేదా మాస్కును ధరించాలి. పొడిచర్మం ఉన్నవారు మాయిశ్చరైజింగ్‌ కోల్డ్‌క్రీముతో మర్దన చేసుకోవాలి. స్నానానికి వాడే సబ్బులలో సున్నం శాతం ఎక్కువగా ఉండే విధంగా చేసుకోవాలి. స్నానానికి మరీ చన్నీళ్లు కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. కూల్‌డ్రింక్స్‌(శీతలపానీయాలు), ఫాస్ట్‌ఫుడ్స్‌ తీసుకోవడం తగ్గించాలి.

No comments:

Post a Comment