Wednesday 11 February 2015

ఆయుర్వేదంలోని జుట్టు పెరుగుదల రహస్యాలు


జుట్టురాలడం అనేది కొందరిలో విడవని వ్యసనంలా ఉంటుంది. అదే పనిగా దిగులు పడుతుంటారు. బట్టతల వస్తుందేమోననే భయం వారిని వెంటాడుతూనే ఉంటుంది. జుట్టురాలడం అనే ఆలోచన ప్రత్యేకించి అమ్మాయిలను ఎక్కువ. ఇక అబ్బాయిలలో జుట్టు రాలడం మొదలు పెట్టిందంటే వారి దిగులు చెప్పాల్సిన పని లేదు. బట్టతల వస్తుందేమోననే భయం వారిలో గుబులు పుట్టిస్తుంది. ఈ సమస్యకు ఆయుర్వేదంలో మంచి వైద్య మార్గాలున్నాయి. ఈ వ్యాధి రావడానికి ఎన్నో కారణాలున్నాయి. కోపం, ఆందోళన, విచారం, మానసి పరిశ్రమలున్న వారిలో జుట్టు రాలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇదిలా ఉండగా కొన్ని జ్వరాల తరువాత, పోషకపదార్థాలు కూడా జుట్టు రాలుతుంది. ఇందుకు ఆయుర్వేదంలో మంచి వైద్యం ఉంది. ఆయుర్వేద వైద్యంలో, జుట్టును (గోళ్ళతో పాటు) ఎముకల ఉత్పత్తులుగా అభివర్ణిస్తారు. ఎముకల నిర్మాణంలో ముఖ్య భూమికను పోషించే అస్థి వంటి పదార్థాలు కూడా, జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. కావున వెంట్రుకల ఆరోగ్యం కోసం మరియు వాటి పెరుగుదల కోసం పోషకాలు తప్పనిసరి. మీ శరీరంలో కాల్షియం మరియు మెగ్నీషియం వంటి మూలకాలను గ్రహింపలేనపుడు, ఉదాహరణకు- మీ ఎముకలు మాత్రమే కాకుండా, కేశాలు కూడా పెలుసుళుగా మారతాయి, సులువుగా తెగిపోవటం, మొదల్లలో సమస్యలు, జుట్టు రాలిపోవటం కూడా అధికం అవుతుంది. ఒకవేళ మీ కేశాలు ఆరోగ్యవంతంగా లేనట్లయితే, ఈ మూలకాలు మీ శరీరంలో గ్రహించుకోవటం లేదు అని అర్థం, కావున వీటి వలన ఎముకలలో మరియు ఇతరేతర భాగాలు దుష్ప్రభావాలకు లోనవుతాయి. కావున మీ కేశాలు (గోళ్ళు కూడా) ఆరోగ్యంగా ఉంటే ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయని అర్థం. ఇక్కడ పేర్కొన్న ఆయుర్వేదాల వలన మీ కేశాలు ఆరోగ్యవంతంగా, దృడంగా మారతాయో చూద్దాం...
1. సరైన ఆహరం: 
కేశాల ఆరోగ్యం సాధారణంగా మీరు తీసుకునే పోషకాల పైన ఆధారపడి ఉంటుంది. పాల ఉత్పత్తుల అయినట్టి చీస్, పాలు మరియు తాజాగా తయారుచేసిన యొగ్ హార్ట్ వంటివి శరీరంలో ఉండే ఎముకలకు మరియు కేశాలకు ఆరోగ్యకరం అని చెప్పవచ్చు. కొబ్బరి, ఆపిల్ మరియు క్యాబేజీ వలన కూడా కేశాలకు చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. మినరల్'లు ఉన్న ఉపభాగాలు మీ కేశాల యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోటానికి (ఎముకలు ద్రుడత్వం కోసం) కాల్షియం, మెగ్నీషియం, జింక్ మరియు ఇతరేతర మినరల్' లు ఉన్న ఉపభాగాలను తీసుకోండి.
2. కేశాల ఆరోగ్యానికి ఆయిల్ మసాజ్: 
నూనెలతో తల పైన మసాజ్ చేయటం వలన జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆమ్లా, బ్రహ్మ ఆయిల్ వంటివి చల్లదనాన్ని అందిస్తాయి, ఇవి కేశాలకు ఆరోగ్యాన్ని పెంపొందించి, వాటి పెరుగుదలను పెంచి, సహజ మెరుపును అందిస్తాయి. (ఆయిల్ ప్యాక్'ల పైన తెలిపే లేబుల్'లను అనుసరించండి). మీరు పడుకోటానికి ముందుగా, రెండు చెంచాల నూనెను మీ తలకు రాయండి, కానీ ఇక్కడ నూనెను మీ కేశాలకు కాకుండా తలపై చర్మం లేదా వెంట్రుకల మూలాలకు నూనెను రాయండి. ఇలా తలపైన చర్మానికి నూనెతో మసాజ్ చేయటం వలన రక్త సరఫరా జరుగుతుంది మరియు వెంట్రుకల మూలాలకు కావలసిన పోషకాలు అందించబడతాయి. మొదటగా నూనెను గిన్నెలో పోయండి (కొద్దిగా వేడి చేస్తే మంచిది), మీ చేతి వెళ్ళను నూనెలో ముంచండి. తరువాత మీ వెళ్ళను తల పైన ఉంచి నెమ్మదిగా వెంట్రుకల మూలాలకు మసాజ్ చేయండి, ఈ నూనె మీ వెంట్రుకల మూలాలకు అంటేలా జాగ్రత్త పడండి. కొద్దిగా ఒత్తిడితో నూనెను అద్దటం వలన మీ వెంట్రుకల మూలాలకు నూనెలోని పోషకాలు అందించబడతాయి మరియు రక్త సరఫరా మెరుగుపడుతుంది. 
3. నువ్వులు:
 రోజు ఉదయాన, ఒక పిడికెడు తెల్లటి నువ్వు విత్తనాలను తినండి. పిడికెడు నువ్వు విత్తనాలలో సూమారు 1,200 గ్రాముల కాల్షియం మరియు మెగ్నీషియం అందించబడి మీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కాల్షియం కోసం కొబ్బరి నీళ్ళు 
4. కొబ్బరి నీళ్ళు:
 కొబ్బరి నీళ్ళు త్రాగటం వలన (తాజా కొబ్బరి లోపల ఉండే నీళ్ళ వలన) జుట్టు పెరుగుదలకు కావలసిన కాల్షియం అందించబడుతుంది. మీరు రోజులో 1/2 కప్పు కొబ్బరి నీరు త్రాగవచ్చు. కొబ్బరి పాలు త్రాగటం కూడా ఆరోగ్యానికి మంచిది కానీ ఇది రెండవ ప్రాముఖ్యత కలిగి ఉంది. మీ శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలు అధికంగా ఉన్నాయా..అయితే మీరు ఎక్కువ మొత్తంలో కొబ్బరి తీసుకోవటం అంత మంచిది కాదు. కారణం-కొబ్బరిలో ఎక్కువ సాచురేటేడ్ ఫాట్'లు ఉంటాయి, ఇవి శరీర రక్తంలో కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతాయి. 
5. కేశాలను దువ్వటం:
మీ జుట్టును దువ్వెటపుడు, వెంట్రుకలకు వ్యతిరేఖంగా దువ్వుతారు, దీని వలన వెంట్రుకల మూలాలలో రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది. దువ్వెనతో గట్టిగా దూయటం వెంట్రుకల ఆరోగ్యానికి మంచిది కాదు. యోగా 
6. యోగ:
యోగా చేయటం వలన మెడ మరియు తలకు సంబంధించిన భాగాలలో కలిగే ఒత్తిడి శక్తివంతంగా తగ్గించబడుతుంది, అంతేకాకుండా రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది. యోగాల వలన కేశాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

No comments:

Post a Comment