Saturday 9 January 2016

అరటితొక్కతో మీకు తెలియని ఉపయోగాలెన్నో..!!

అరటిపండ్లు.. అన్నిరకాల పండ్ల కంటే చౌక. ప్రతి ఒక్కరూ ఇష్టపడేది. అలాగే.. అన్ని కాలాలలో.. అన్ని వర్గాల వారు కొని తినగలిగేది. అరటిపండుతోనే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందుతాము. అలాగే తొక్కతో కూడా పొందే
ప్రయోజనాలు బోలెడున్నాయి. తొక్కను ఉపయోగించుకోవడానికి చాలా మార్గాలున్నాయి. అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు గాయాలకు అరటిపండు తొక్క చర్మంపై చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఏదైనా గాయం తగిలినప్పుడు తొక్క లోపలి భాగాన్ని గాయంపై పెడితే.. వెంటనే ఉపశమనం కలుగుతుంది. గాయం వల్ల చుట్టుపక్కల ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. అయితే అరటితొక్క మాత్రం చాలా ఫ్రెస్ గా ఉండాలి. అప్పుడే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మొటిమలకు ముఖంపై మొటిమలు.. కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తాయి. ఇతరులతో మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. మొటిమలు తగ్గించడానికి కెమికల్ ట్రీట్మెంట్స్ ఖర్చుపెట్టకుండా.. అరటితొక్కతో సింపుల్ రెమిడీ ఫాలో అయిపోండి. ముందు ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని అరటితొక్క లోపలి భాగంతో ముఖంపై కాసేపు సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై జిడ్డు తగ్గిపోయి.. పింపుల్స్ కూడా తగ్గిపోతాయి. బరువు తగ్గాలనుకుంటున్నారా ? ఐతే బనానా డైట్ ఫాలో అవండి గార్డెనింగ్ అరటిపండు తిన్నాక తొక్కలను డస్ట్ బిన్ లో పడేయకుండా.. మీ ఇంటి పెరట్లో పడేయండి మంచి ఫలితాలు పొందవచ్చు. అరటితొక్కలో ఉండే పొటాషియం, ఫాస్పరస్ మొక్కలకు సహాయపడతాయి. అరటితొక్కలను ముక్కలుగా కట్ చేసి మట్టిలో వేయడం వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతాయి. మిలమిల మెరిసే పళ్లు మిలమిల మెరిసే పళ్లు పొందడానికి చాలా మంది చాలా టీత్ వైటెనింగ్ ప్రొడక్ట్స్ కోసం వెతుకుతూ ఉంటారు. రోజూ పేస్ట్ తో బ్రష్ చేసుకోవడానికి ముందు అరటితొక్కతో కాసేపు పళ్లపై రుద్దుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఇలా రెండు వారాల పాటు చేస్తే.. మెరిసే పళ్లు మీ సొంతమవుతాయి. మీ షూస్ మెరవడానికి అరటితొక్కలో ఎంజైమ్స్ ఉంటాయి. అవి షూస్ తళతళ మెరవడానికి సహాయపడతాయి. షూస్ కొన్నప్పుడు ఉండే షైనింగ్.. తర్వాత తగ్గిపోతాయి. అయితే షూస్ పై రుద్దడానికి ముందురోజు తీసేసిన అరటితొక్క ఉపయోగించాలి. దీనివల్ల మీ షూస్ కొత్త నిగారింపు సంతరించుకుంటాయి. జుట్టు రాలడం తగ్గిస్తుంది..జుట్టు పెరిగేలా చేస్తుంది: అరటి జ్యూస్ హెయిర్ కండిషనర్ అరటితొక్కలో ఉండే పొటాషియం, ఎమినో యాసిడ్స్.. జుట్టు థిక్ గా కనిపించేలా చేయడమే కాదు.. వేగంగా పెరిగేలా చేసి.. కండిషనర్ లా పనిచేస్తాయి. కాబట్టి అరటితొక్కలను బాగా మెత్తగా పేస్ట్ లా చేసి.. తలకు అప్లై చేయడం వల్ల జుట్టు నల్లగా నిగారిస్తుంది.

No comments:

Post a Comment