Friday 29 November 2013

ఆముదంనూనెలోని అద్భుత సౌందర్య గుణాలు


క్యాస్టోర్ ఆయిల్ (ఆముదం)ఒక నేచురల్ ప్లాంట్ ఆయిల్ ఆముదం మొక్క నుండి వచ్చిన విత్తనాల నుండి నూనెను తయారుచేస్తారు. ఇందులో రిసినోలిస్ యాసిడ్ సంవృద్ధిగా ఉంటుంది, ఇది యాంటీఇన్ఫ్లమేటరి, యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఒక అందమైన శరీరానికి దోహదం చేస్తుంది. క్యాస్టోర్ ఆయిల్ (ఆముదం నూనె)ను సాధారణంగా ఒక భేదిమందుగా ఉపయోగిస్తారు, కానీ అది అనేక ఇతర అద్భుతమైన లక్షణాలను కూడా కలిగి ఉంది. అలాగే ఇందులో అధిక మాయిశ్చరైజ్ సామర్థ్యాన్ని కలిగి ఉండి, ఇది చాలా బాగా కేశాలను మరియు చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఆముదం జుట్టును బలోపేతం చేయడానికి మంచి సామర్థ్యం కలిగి ఉందని తెలుసు. ఇది చర్మం మరియు జుట్టు రెండింటి కోసం లోతైన కండీషనర్ గా పనిచేసేటటువంటి ఒక మార్ధవకరమైన నూనె. ఈ లక్షణాలు కలిగి ఉన్నందు వల్ల, ఆ ఆముదం నూనెను, కొన్నివేళ సంవత్సరాల నుండి జుట్టు మరియు చర్మ సౌందర్యాలలో ఉపయోగిస్తున్నారు. అనేక ఉత్పన్నాలు రిసొనోలేట్, ను కొన్ని సాధారణ కాస్మొటిక్స్ ప్రొడక్ట్స్ సోపులు, ఐలైనర్, డియోడరెంట్, లిప్ స్టిక్, లేదా పెర్ఫ్యూమ్స్ లలో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. మరి మీరు కూడా వీటిని ఉపయోగించుకోవాలనుకుంటే, రసాయనాలతో తయారుచేసిన బ్యూటీ ప్రొడక్ట్స్, చికిత్సలకు బదులుగా ఈ క్యాస్టోర్ ఆయిల్ ను ఎంపిక చేసుకోండి. కాబట్టి, మీ బ్యూటీ కిట్ లో కాస్ట్రో ఆయిల్ ను చేర్చుకొని, మీ అందంలో కొత్త మార్పులను చూసి ఎంజాయ్ చేయండి . మీకు ఉపయోగపడే కొన్ని బ్యూటీ బెనిఫిట్స్ ఇక్కడ ఉన్నాయి...

ఏజ్ స్పాట్స్ ను మాయం చేయండి: ఆముదం నూనెను ఉపయోగించి వయస్సుతో వచ్చే మచ్చలను తొలగించడానికి ఒక సులభమైన మార్గం. ఆముదం నూనెను వృద్ధాప్యం మచ్చలున్న ప్రదేశంలో అప్లై చేసి వృత్తాకార మోషన్ లో సున్నితంగా రుద్దాలి. ఈ వ్యాయామంను రోజుకు రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మీరు ఫలితాలు చూసి, ఆశ్చర్యం చెందుతారు.


No comments:

Post a Comment