Friday 29 November 2013

ఇటువంటి స్పెషల్ వంటలు


ఇటువంటి స్పెషల్ వంటలు ‘ఫిషర్ మెన్ కాలనీ' వారు మనకు పరిచయం చేస్తారు. ఈ ప్రత్యేకపమైన వంట మహరాష్ట్రలోని కోలీ లేదా ఫిషర్ మెన్ వారిది. అందుకే ఈ రిసిపికి ఫిష్ కోలీవడ అని పేరు. ఈ రుచికరమై వంట అక్కడ చాలా పాపులర్. అంతే కాదు, ముంబాయ్ లోని చిన్న పెద్ద అన్ని ఫుడ్ జాయింట్స్ లో కూడా ఇది చాలా ఫేమస్. మరి ఇంతటి రుచికరమైన డిష్ రుచి చూడటానికి ప్రతి ఒక్కరు ముంబాయ్ వెళ్ళడటానికి కుదరదుకదా. కాబట్టీ మీ సీక్రెట్ రిసిపిని మీరు ఇంట్లోనే తయారుచేసుకోవడానికి మీకోసం ఇక్కడ తయారుచేసే విధానాన్ని వివరిస్తున్నాం. ఈ ఫిష్ కోలీవడ తయారుచేయడానికి ముందు అరగంట సమయం మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత స్పైసీ బటర్ లో డిప్ చేసి, కాగే నూనెలో వేసి, డీప్ ఫ్రై చేయాలి. చాలా సులభంగా తయారుచేయవచ్చు. కాబట్టి మీరు కూడా ఈ వీకెండ్ స్పెషల్ గా మీరు ఒక సారి ట్రైచేయండి...

కావల్సిన పదార్థాలు: 
కింగ్ ఫిష్: 500 gms కారం 1 ½tsp శనగ పిండి: 100gms పసుపు: ½tsp అల్లం వెల్లుల్లి పేస్ట్ : ½ tsp గరం మసాల: 1tsp జీలకర్ర పొడి:1/2tsp ఒక నిమ్మకాయంత పరిమానంలో చింతపండు అజ్వజైన్: 1tsp ఉప్పు: రుచికి సరిపడా (అవసరం అయితే 1/2tspతందూరి కలర్ ను మిక్స్ చేసుకోండి) గరం మసాలా కోసం (ఈక్రింది పదార్థాలన్నింటిని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి) లవంగాలు: 2tbsp యాలకులు: 2tbsp సొంపుగింజ: 2tbsp దాల్చిన చెక్కలను -3 (చిన్నవి) 

తయారుచేయు విధానం : 1. ముందుగా చేపలను బాగా శుభ్రం చేసి, వాష్ చేయాలి. తర్వాత పసుపు మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. 2. తర్వాత చేపముక్కలు తప్ప మిగిలిన పదార్థాలన్నింటి ఒక వేబౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి. 3. ఇప్పుడు పసుపు, ఉప్పు మిక్స్ చేసి పెట్టిన చేప ముక్కలను కలుపుకొన్న పిండి మిశ్రమంలో వేసి, బాగా మిక్స్ చేసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. 4. తర్వాత ఒక పాన్ లో నూనె వేసి, కాగిన తర్వాత అందులో చేపముక్కలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చేపముక్కలు రెడ్డిష్ బ్రౌన్ కలర్ కు మారగానే పక్కన తీసిపెట్టుకోవాలి. 5. తర్వాత ఈ వేడి వేడి ఫిష్ మీద ఛాట్ మసాలా మరియు నిమ్మరసం చిలకరించి పెట్టుకోవాలి. అంతే రుచికరమైన కింగ్ ఫిష్ కోలీ వడ రెడీ . ఈ అద్భుతమైన ఫిష్ రిసిపిని పుదీనా చట్నీతో సర్వ్ చేయండి.

No comments:

Post a Comment