Monday 9 March 2015

పుచ్చకాయతో వేసవి చర్మ సమస్యలన్నీ మాయం..

వేసవికాలంలో విరివిగా లభించే పళ్లలో ‘పుచ్చకాయ'కూడా ఒకటి. వేసవి వేడిమికి చెక్ పెడుతూ శరీరానికి చల్లదనాన్ని చేకూర్చే ఈ పండు వల్ల కేవలం ఆరోగ్యపరమైన ప్రయోజనాలే కాదు...
సౌందర్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మరి, ఆ ప్రయోజనాలు ఏంటి? వాటిని ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోవాలంటే మాత్రం ఈ ఆర్టికల్ చేదవాల్సిందే.. పుచ్చకాయలోని 92శాతం నీరు ఉంటుంది. ఇది తినడం ద్వారా వేసవిలో శరీరం నుంచి పోయే నీటిశాతాన్ని తిరిగి పునరుద్దరించుకోవచ్చు. ఫలితంగా చర్మం తాజాగా కనిపిస్తుంది. అంతేకాకుండా దీనిలో ఉండే గింజల వల్ల కూడా చాలా సౌందర్యపరమైన ప్రయోజనాలున్నాయి. చర్మాన్ని సున్నితంగా చేసి, మాయిశ్చరైజ్ చేయడంలో వీటిని మించినవి లేవంటే అతిశయోక్తి కాదు. పుచ్చకాయ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు... 

టోనర్ గా పనిచేస్తుంది: వాటర్ మెలోన్ చర్మానికి సహజసిద్దమైన టోనర్ గా పనిచేస్తుంది. ఒక చిన్న పుచ్చకాయ ముక్కని కోసి నేరుగా చర్మం మీద రుద్దచ్చు. లేదంటే తేనెతో కలిపి మెత్తని ముద్దగా చేసుకుని ఆ మిశ్రమంతో కూడా చర్మానికి మృదువుగా మర్దన చేయవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మం ప్రకాశించడమే కాకుండా నునుపుగా కూడా మారుతుంది.


No comments:

Post a Comment