Saturday 20 June 2015

వెల్లుల్లి ఉపయోగించి సహజ మరియు ఆయుర్వేద హెయిర్ డై

రసాయన మరియు అమ్మోనియా ఆధారిత ద్రవ హెయిర్ డై ని ఉపయోగించడం వలన తల మీద చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి ప్రమాదకరం. జుట్టు రంగులో ఉండే హానికరమైన రసాయనాల వలన మీ కళ్ళు మరియు చూపు మీద కూడా ప్రభావం చూపుతుంది. ఈ ఉత్పత్తుల వలన మీరు సాదారణంగా కంటే వేగంగా జుట్టును కోల్పోతారు.
గోరింట ఆధారిత పౌడర్ ను జుట్టు రంగుకు ఉపయోగించడం వలన జుట్టు నిస్తేజంగా మరియు రంగు త్వరగా కోల్పోవటం జరుగుతుంది. తరచుగా జుట్టుకు రంగు వేయటం వలన జుట్టు రూపాన్ని మరింత డల్ చేస్తుంది. కాబట్టి, ఇక్కడ వెల్లుల్లి పై పొరను ఉపయోగించి ఎక్కువకాలం ఉండే జుట్టు రంగును చేయడానికి ఒక సహజ పద్ధతి ఉంది. నేచురల్ ఆయుర్వేద హెయిర్ డై చేయడానికి అవసరమైన వస్తువులు: వెల్లుల్లి (పెద్ద పరిమాణం) ఆలివ్ ఆయిల్ కాటన్ క్లాత్ సహజమైన జుట్టు రంగు తయారుచేసే విధానం: 1. వెల్లుల్లి తొక్కలను ఎక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఎందుకంటే బూడిద తయారు చేయడానికి తక్కువ పరిమాణంలో సరిపోవు. 2. ఒక పాన్ లో వెల్లుల్లి తొక్కలను వేసి నలుపు బూడిద అయ్యేవరకు వేగించాలి. 3. ఒక కాటన్ వస్త్రం తో ఈ బూడిదను జల్లించాలి. 4. ఈ బూడిదకు ఆలివ్ నూనెను కలిపి పేస్ట్ గా తయారుచేయాలి. 5. దీనిని గాజు సీసా లో పోసి 7 రోజులు ప్రిజర్వ్ చేయాలి.(రిఫ్రిజిరేటర్ లో పెట్టకూడదు) 6. 7 రోజుల తరువాత హెయిర్ డై మాదిరిగానే జుట్టుకు రాయాలి. సాయంత్రం సమయాల్లో రాసి మరుసటి ఉదయం తలస్నానం చేయాలి. 7. మంచి పలితాల కోసం తరువాతి రోజు తల స్నానం చేయకుండా రెండు,మూడు రోజులు అయ్యాక చేస్తే మంచిది. ఈ జుట్టు రంగు జుట్టుకు సహజ లుక్ ని ఇస్తుంది. అలాగే దీర్ఘ కాలం పాటు ఉంటుంది. ఎందుకంటే ఆలివ్ నూనె జుట్టును ఆరోగ్యకరముగా ఉంచుతుంది. మీ ఆహారంలో బోయోటిన్, జింక్, ఇనుము, అయోడిన్, ప్రోటీన్ సంబంధిత పదార్ధాలను తీసుకుంటే మీ జుట్టు ఆరోగ్యకరమైన మరియు సహజ రంగులో ఉంటుంది. సహజమైన గిరజాల జుట్టు కొరకు: పైన 1,2,3,4 దశలను అనుసరించండి. అలాగే జుట్టు మీద మరియుజుట్టు మూలాలకు ఈ పేస్ట్ ను 30 నిమిషాల తర్వాత రాయండి. ఒక గంట తర్వాత మీ జుట్టును కడగండి. ఈ అప్లికేషన్ మూలాల నుండి మీ జుట్టును గిరజాలు చేస్తుంది. మరింత గిరజాల జుట్టు కోసం, రెండు నెలల పాటు ఈ ప్రక్రియను ప్రతి 15 రోజులకు పునరావృతం చేయండి.

No comments:

Post a Comment