Saturday 27 June 2015

రోస్ట్‌ చికెన్‌ దాజాజ్‌

రంజాన్‌ మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో వివిధ రకాల మాంసాహార వంటలు తయారు చేస్తుంటారు. ముఖ్యంగా ఏ హోటల్లో చూసినా హలీం కనువిందు చేస్తుంటుంది. ఇక,ఈ మాసంలో రెగ్యులర్‌గా చేసుకునే వంటలకు బదులు
కొత్త వంటకాన్ని ప్రయత్నిస్తే ఇంట్లో వాళ్ళు ఆనందిస్తారు కదూ! మరి ఆ స్పెషల్‌ వంటకం ఏమిటంటే... రోస్ట్‌ చికెన్‌ దాజాజ్‌. దీన్ని సౌదీలో ఎక్కువగా వండుతుంటారు. మరి, ఈ వంటకానికి కావాల్సిన పదార్థాలేమిటో, ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు: చికెన్‌ - 500గ్రా, వైట్‌రైస్‌(ఉడికించినది) - 2 కప్పులు, రెడిమెడ్‌ మీట్‌ ఫ్లేవర్‌ - ఒక టేబుల్‌ స్పూను, బటర్‌ - రెండు టేబుల్‌ స్పూన్లు, బాదం(పొట్టు తీసి వేయించినవి) - పావు కప్పు, టమాటా గుజ్జు - 2 టీ స్పూన్లు, ఉల్లిపాయలు - పావు కప్పు (తరిగినవి), లవంగాలు - 3, కుంకుమ పువ్వు - ఒక టీ స్పూను, బ్లాక్‌ పెప్పర్‌ - ఒక టీ స్పూను, ఎండు ద్రాక్ష - పావు కప్పు, సెనగలు - 50గ్రా, ఉప్పు - రుచికి తగినంత, ఆలివ్‌ ఆయిల్‌ - 2 టేబుల్‌ స్పూన్లు.
తయారీ: ఒక పెద్ద పాన్‌ తీసుకొని అందులో ఆలివ్‌ ఆయిల్‌ వేసి మీడియం మంట మీద వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయలు, చికెన్‌ ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేగించుకోవాలి. తర్వాత కుంకుమపువ్వు, ఉప్పు, పెప్పర్‌ చిలకరించి ఫ్రై చేయాలి. ఆ తర్వాత అన్నం, బాదం, ద్రాక్ష కూడా వేసి బాగా కలపాలి. ఇందులో కొద్దిగా బటర్‌ వేసి మీడియం మంట మీద చికెన్‌ ఉడికేంత వరకు ఉంచి దించేయాలి. అంతే రుచికరమైన రోస్ట్‌ చికెన్‌ దాజాజ్‌ రెడీ.

No comments:

Post a Comment