Thursday 8 October 2015

మీరు ఎలాంటి దువ్వెన వాడుతున్నారు ?

మీ జుట్టుకి ఎలాంటి దువ్వెన వాడుతున్నారు ? ఒక్కసారి చెక్ చేసుకోండి. కనీసం మూడు రకాల దువ్వెనలు మీ డ్రెస్సింగ్ టేబుల్ లో ఉండాల్సిందే. మీ జుట్టు పల్చగా ఉన్నా.. మందంగా ఉన్నా ప్రతి ఒక్కరికి మూడు దువ్వెనలు
ఉండాల్సిందే అంటున్నారు నిపుణులు. స్టీల్, మెటల్ దువ్వెనలను తడి జుట్టుకి వాడటం మంచిదని సూచిస్తున్నారు. అందమైన జుట్టు ఉందిలే అని సంబరిపడిపోతే సరిపోదు.. దాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. సున్నితంగా చిక్కు తీసుకోవాలి. బాగా దువ్వడం వల్ల జుట్టు పెరగడమే కాదు.. రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. అలాగని ఏ దువ్వెన పడితే దాన్ని వాడితే.. జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. కాబట్టి మీ కురుల తత్వాన్ని బట్టి దువ్వెనను ఎంపిక చేసుకోవాలి.

No comments:

Post a Comment