Sunday 18 October 2015

మిల్క్ బ్యూటీ తమన్నా బ్యూటీ సీక్రెట్...

పాలమీగడ లాంటి మేని ఛాయ ఉన్న తమన్నా మొత్తానికి తన అందం వెనుక ఉన్న రహస్యాలని వెళ్ళడించింది. నటీమణులు తమ అందం కాపాడుకోవడం కోసం ఏమి చెయ్యడానికైనా సిద్ధపడతారు. కానీ తమన్నా మాత్రం ఈ
కోవ కి చెందదు అనిపిస్తుంది.ఆమె నటించిన "చాంద్ సా రోషన్ చెహ్రా(చంద్రకాంతి లాంటి ముఖం)" సినిమా టైటిల్ వన్నెలీనే ఆమె ముఖాని సరిగ్గా సరిపోతుంది. తమన్నా,తాను ప్రమాదకర రసాయనాలున్న కాస్మెటిక్ ఉత్పత్తులకి దూరం అని చెప్పింది. నిగనిగలాడే ఆమె చర్మమే మొట్టమొదట ఆమెని చూడగానే ఆకట్టుకునే అంశం.తన వృత్తిలో భాగం గా రకరకాలా ఉష్ణోగ్రతలని తట్టుకుంటూ, అంతంత మేకప్ వేసుకుంటూ కూడా ఆమె పాల మీగడ లాంటి దేహ ఛాయని ఎలా కాపాడుకోగలుగుతుంది అని ఆశ్చర్యపోతుంటారు అమెని తెర మీద చూసే ప్రేక్షకులు, తోటి నటీమణులు.కాంతులీనే ఆమె దేహ ఛాయే కాదు ఫ్లాట్ గా ఉండే ఆమె పొట్ట, బహు నాజూకుగా ఉండే ఆమె శరీర సౌష్టవం కూడా ఆమె సొత్తు. అవి చూసి తోటి నటీమణులు కూడా ఈర్ష్య పడుతుంటారు. కానీ తాను అస్సలు తన చర్మం గురించి శ్రద్ధ తీసుకోననీ,వాళ్ళ అమ్మ ఖరీదైన కాస్మెటిక్స్, దేహ ఛాయ ని మెరుగు పరిచే క్రీం లు(ఫెయిర్ నెస్ క్రీంస్) లాంటి వాటికి వ్యతిరేకమనీ చెప్పింది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ. ఆమె రంగు ఆమెకి జన్యుపరంగా సంక్రమించినా తన గ్లామర్ ని కాపాడుకోవడానికి,ముఖం,జుట్టు, శరీర సౌష్టవం కోసం తప్పకుండా శ్రద్ధ తీసుకోవాలి.ఈ క్యూట్ అమ్మాయి ఒక కఠిన నియమావళి ని తన రొటీన్ లో భాగం చేసుకుంది. అదేమిటో తనే చెప్పింది.

No comments:

Post a Comment