Sunday 10 May 2015

'అమ్మ` ప్రేమ వెలకట్టలేనిది!

అమ్మను మించిన దైవమున్నదా..?
అని ప్రశ్నిస్తున్న కవి తన పాట
ద్వారా అమ్మ గొప్పదనాన్ని చాటి
చెప్పారు. అమ్మ ప్రేమకు లోకంలో
ఏదీ సాటిలేదని... సరిరాదని
ఉద్ఘాటించారు...

సరిరాదని ఉద్ఘాటించారు. మానవ జాతి
పురోగతి ... వికాసం ...
గొప్పదనం ... మాతృత్వంలోనే
ఇమిడి ఉంది. మాతృత్వం లేని
సమాజాన్ని ఊహించలేం.

అమ్మ గొప్పదనం చెప్పాలనే ఉద్ధేశ్యంతో 20వ శతాబ్ధంలో ప్రపంచ వ్యాప్తంగా చర్చలు సాగాయి. ఆ క్రమంలోనే మాతృదినోత్సవం వేడుకలు ప్రారంభమయ్యాయి. మొదట 1908 లో అమెరికాకు చెందిన సామాజిక కార్యకర్త అన్నా వర్టిస్ మదర్స్ డే పేరుతో పశ్చిమ వర్ణీనియాలోని గ్రాప్టన్ నగరంలో నిర్వహించారు. ఆ తరువాత అమెరికా కాంగ్రెస్ లో చట్టం చేసారు. అమెరికా అధ్యక్షులు ఉడ్రోవిల్సన్ హయాంలో మే రెండో ఆదివారం నిర్వహించాలని తీర్మాణం చేసారు. ఆ మేరకు నేడు సుమారు 94 దేశాలు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. బిగిలిన దేశాలు తమ క్యాలెండర్ ప్రకారం మార్చి, మే నెలల కాలంలో జరుపుకుంటారు.
భారత్ లోనూ మే రెండో ఆదివారం ప్రపంచ మాతృదినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. బారత సమాజం సంస్కృతి సాంప్రదాయాలు మత ఆచారాల ప్రకారం తల్లిని దేవదూతగా అభివర్ణిస్తారు. దేశ భౌగోళిక స్వరూపాన్ని సైతం భారత మాత అని సంభోధిస్తారు. వేద నాగరికత కాలంలోనూ మాతృస్వామ్మ వ్యవస్థ కొనసాగుతున్నప్పటికి కుటుంబంలో సమాజంలో తల్లి పాత్ర అసమానమైంది. సమాజంలో సగ బాగంగా ఉన్నా మహిళ తల్లిగా చెల్లిగా ఇల్లాలిగా తన కర్తావ్యాన్ని నెరవేరుస్తుంది.
పాలకులు అనుసరిస్తున్న పురుషాధిక్య, సరళీకరణ విధానాలు తల్లి పాత్రకు సవాల్ విసురుతున్నాయి. బిడ్డ పెరిగి ప్రయోజకుడైతే ఆ తల్తి సంతోషానికి అవదులుండవు. విషం చిమ్ముతున్న పాశ్చాత్య పోకడలు ... అమ్మకు ఆవేదనను దు:ఖాన్ని మిగుల్చుతున్నాయి. ఏమైన బాధ్యతాయుతమైన భావి సమాజాన్నినిర్మించాల్సిన గురుతర బాద్యత నాటికి నేటి ఏనాటికైనా తల్లులపైనే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
తల్లి ప్రేమ వెలకట్టలేనిది
తల్లి మనసు తల్లి ప్రేమ వెలకట్టలేనిది. మాతృత్వం ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం. పాశ్యాత్య పోకడలు, ఇతర అనేక కారణాలతో విలువలు పడిపోతున్నాయి. మంచి విలువను కాపాడాల్సిన బాధ్యత నేటి తల్లులపై ఉంది. తల్లి ఆశలను బిడ్డలు నెరవేర్చాలి. బిడ్డలు ప్రయోజకులయితే తల్లి సంతోషం మాటల్లో చెప్పలేదు. చెడు అలవాట్లకు గురయిన పిల్లలను చూసి తల్లుల మనుసు ఎంతో క్షోభను అనుభవిస్తుంది. వాటికి దూరంగా ఉండాలి. వ్యక్తి నిర్మాణంతోనే వ్యవస్థ నిర్మాణం ఆధారపడి ఉంది. నూతన సామాజిక వ్యవస్థను నిర్మించాల్సిన బాధ్యత కూడా నేటి తల్లుల పైనే ఉంది.
విద్యతోనే విలువలు

సమాజంలో ప్రతి చదువు నేర్చుకోవాలి. విద్యతోనే విలువలతో కూడిన సమాజం నిర్మాణం అవుతుంది. చాలా మంది తల్లులు తమ పిల్లలకు మార్కులు వస్తే పరవాలేదనే దోరణితో ఉంటారు. అది సరికాదు. మార్కులతో పాటూ ఎంత మంచి ప్రవర్తనను కలిగి ఉన్నాడనేది చూడాలి. నేర్పాలి. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల సగటు తల్లికి కుటుంబాన్ని నడపడం ఒక సవాల్ గా మారుతోంది. ఇల్లు నెట్టుకురావడం, బిడ్డల చదువులు, ఉపాధి, ఉద్యోగం వంటి అంశాలు సమస్యగా పరిణమిస్తున్నాయి.

No comments:

Post a Comment