Saturday 9 May 2015

తేనె స్వచ్చంగా ఉందని తెలుసుకోవటానికి మార్గాలు

       

 తేనే అనేది సున్నితమైన తీయని ఐదు అక్షరాల పదం. అందువలన, మీరు మీ లవర్స్ గురించి చెప్పుతున్నప్పుడు దీనిని ఎంచుకుంటారు. కనుక తేనె మీ జీవితంలో చాలా ముఖ్యమైనది. ఇప్పుడు వాస్తవం గురించి తెలుసుకుందాం. అయితే తేనె స్వచ్ఛంగా ఉందని తెలుసుకోవటం చాలా కష్టం. సాధారణంగా మీరు ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ప్రఖ్యాత బ్రాండ్లు కోసం చూడండి. దానికి తేనె కూడా మినహాయింపు కాదు. అన్ని బ్రాండ్లు మీ ఆరోగ్య ప్రయోజనం కోసం 100% స్వచ్ఛమైన తేనె అని వాదిస్తాయి. కానీ మీరు వాటిని ఎలా నమ్ముతారు? కానీ మీరు సీసా తెరిచి దాని స్వచ్ఛత తనిఖీ చేయటం కుదరదు. దానికి షాప్ కీపర్లు అనుమతించరు. కాబట్టి, మీ తేనె స్వచ్ఛమైనదని తెలుసుకోవటానికి మార్గాలు ఏమిటి? నిజం చెప్పాలంటే, దానిని కొనుగోలు చేయటానికి ముందు స్వచ్ఛమైన తేనెను కనుగొనటం అంత సులభం కాదు. కానీ తేనె మానవ జీవితంలో ప్రధానమైన ఆహారంగా ఉంది.
నిమ్మకాయ తేనె
 ఉదయం నుంచి డిన్నర్ వరకు తేనెను అనేక వంటలలో ఉపయోగిస్తాం. ఆహార నియంత్రణ చేసే వారికి తేనె చాలా మంచిది. పంచదారకు బదులుగా తేనెను ఉపయోగించవచ్చు. తేనె స్వచ్ఛమైనదని ఎలా తెలుసుకోవాలి ? స్వచ్ఛత పొందడానికి ఏవైనా ఉపాయాలు ఉన్నాయా ? అవును, మీ తేనె స్వచ్ఛమైనదని తెలుసుకోవటానికి ఖచ్చితంగా కొన్ని మార్గాలు ఉన్నాయి. అయితే,చాలా మంది కొనుగులు తర్వాత చూస్తారు. కనీసం మీరు ఆ దుకాణం నుండి తేనె కొనుగోలు చేయరాదని తెలుసుకోవాలి లేదా దానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయవచ్చు. మీకు మీ తేనె స్వచ్ఛంగా ఉందని తెలుసుకోవటానికి ఏదైనా ఆలోచన ఉందా? లేబుల్ తనిఖీ చెయ్యండి 
అవును, ఇది మీ తేనె స్వచ్ఛంగా ఉందని తెలుసుకోవటానికి ఒక మార్గం. మీరు పరిశీలన పద్ధతులు తర్వాత దరఖాస్తు చేయవచ్చు. కానీ కొనుగోలు సమయంలో మాత్రం జాగ్రత్తగా లేబుల్ తనిఖీ చేయాలి. మీరు ఏవైనా అదనపు పదార్ధాలను కనుగొంటే అది కొనుగోలు చేయకూడదు. 
నీటి పరీక్ష 
ఇది మీ తేనె స్వచ్ఛమైనదని తెలుసుకోవటానికి సమర్థవంతమైన మార్గాలలో ఒకటి. ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ తేనెను వేయాలి. అది కరిగితే స్వచ్చమైన తేనే కాదని అర్ధం. నీటి లోకి పోసిన వెంటనే స్వచ్ఛమైన తేనె ఎల్లప్పుడూ గడ్డలుగా ఏర్పడుతుంది. ఫైర్ టెస్ట్ ఈ విధమైన పరీక్ష చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తేనే మండే వస్తువు. ఒక కొవ్వొత్తి తీసుకొని వెలిగించి కాటన్ విక్ ని తేనేలో ముంచి కాల్చండి. కాటన్ విక్ బర్న్ మొదలవుతుంది, అప్పుడు తేనె స్వచ్ఛమైనది. లేకపోతే, తేనెలో నీరు ఉందని అర్ధం. 
పేపర్ టెస్ట్ 
ఈ టెస్ట్ కోసం బ్లాటింగ్ పేపర్ అవసరం. ఈ పేపర్ మీద ఒక డ్రాప్ తేనె వేయాలి. ఏవైనా కల్మషాలు ఉంటే, కాగితం తేనెను గ్రహిస్తుంది. స్వచ్ఛమైన తేనె కాగితం మీద ఉంటుంది. ఇది మీ తేనె స్వచ్ఛమైనదని తెలిసి కోవటానికి ఉపయోగకరమైన మార్గాలలో ఒకటి. 

క్లాత్ టెస్ట్
 ఒక వస్త్రం మీద కొన్ని చుక్కల తేనెను పోయాలి.మలినాలు ఉంటే తేనె శోషించబడుతుంది. మీరు మరొక విధంగా కూడా స్వచ్ఛత కోసం ప్రయత్నించవచ్చు.వస్త్రం నుండి తేనెను కడిగినప్పుడు ఎటువంటి మరక లేకపోతే,మీ తేనె స్వచ్ఛమైనది. 
ఆల్కహాల్ టెస్ట్ 
ఒక గ్లాస్ లో తేనె మరియు ఆల్కహాల్ లేదా స్పిరిట్ ను సమాన నిష్పత్తిలో తీసుకోవాలి. అది మలినాలతో ఉంటే పలుచగా చేయబడుతుంది. అయితే స్వచ్ఛమైన తేనె అయితే ఖచ్చితంగా గడ్డలూ ఏర్పరుచుకుంటుంది. తేనె మలినాలతో ఉంటే కనుక మీ ప్రయోగం తర్వాత ఒక మిల్కీ వైట్ ద్రవాన్ని కనుగొంటారు. 
హీట్ టెస్ట్ 
మీరు తేనెకు వేడి అవసరం లేదని విని ఉండవచ్చు. వేడి తేనెను విషపూరితం చేయవచ్చు. అయితే దీనికి ఎటువంటి శాస్త్రీయ నిరూపణ లేదు. కాబట్టి, తేనెను కొద్దిగా వేడి చేయవచ్చు. మీకు మలినాలతో ఉంటే ఒక బుడగను చూడవచ్చు. అయితే స్వచ్ఛమైన తేనె కారమేలైజ్డ్ చేయబడుతుంది. 
గడియారం టెస్టు 
ఇది చాలా ఆసక్తికరముగా ఉంది. నిజానికి ఈ ప్రయోగంలో గడియారంతో సంబంధం లేదు. కానీ అనేక మంది ఈ పద్ధతిని నమ్మారు. ఒక సీసా లోని తేనెను ఒక కుండ లో పోయటం ప్రారంభించండి.తేనె సవ్య దిశలో వచ్చినట్లయితే, ఇది స్వచ్ఛమైనదని భావించబడుతోంది. 
బ్రెడ్ టెస్టు
 అల్పాహారం సమయంలో దీనిని ప్రయత్నించండి.స్వచ్ఛమైన తేనె ఎల్లప్పుడూ బ్రెడ్ ను హార్డ్ చేస్తుంది.తేనెలో కలుషితాలు ఉంటే, బ్రెడ్ తడిగా మారి మునిగిపోతుంది. ఎందుకంటే తేమ ఎక్కువ అవుతుంది. 
వాసన 
సాదారణంగా తేనె స్వచ్ఛమైనది కాకుంటే పుల్లటి వాసన వస్తుంది. అంతేకాక మీరు తెలుపు నురుగు పదార్ధంను కనుగొంటారు. దానిని వెంటనే మానివేయటం ఉత్తమం. స్వచ్ఛమైన తేనె మీ భావాలకు అనుగుణంగా సున్నితమైన, తేలికపాటి వాసనను కలిగి ఉంటుంది. ఈ మార్గాల ద్వారా చాలా సమర్థవంతంగా మీరు స్వచ్ఛమైన తేనెను తెలుసుకోవచ్చు.

No comments:

Post a Comment