Wednesday 27 May 2015

వేసవిలో... కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారం

వేసవిలో... కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారం శరీరాన్ని పదిలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సీజన్‌లో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. కూల్ డ్రిక్స్..సూప్సే కాకుండా వేసవిలో కూరగాయలతో రకరకాల సలాడ్స్ తయారు చేసుకోవచ్చు.

అలాంటి సలాడ్స్ లో పీస్ కార్న్ సలాడ్ రిసిపి ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మరియు సులభం కూడా. సలాడ్స్ ను తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్ తో తయారుచేయవచ్చు. చాలా మంది డైటర్స్ సలాడ్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకుంటారు . అయితే కొంచెం డిఫరెంట్ గా హెల్తీ వేలో బరువు తగ్గించుకోబడానికి పీస్ కార్న్ సలాడ్ గ్రేట్ గా సహాయపడుతుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...
కావల్సిన పదార్థాలు: 
పచ్చిబఠానీలు: 1cup
కార్న్: 1cup
ఉల్లిపాయ: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటో: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కొత్తిమీర: కొద్దిగా(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
నిమ్మరసం: కొద్దిగా
బ్లాక్ పెప్పర్ పౌడర్: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం: 
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పచ్చిబఠానీలు, ఉల్లిపాయ, టమోటో, మరియు కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేయాలి.
2. తర్వాత అందులో నిమ్మరసం, ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్, కార్న్, మరియు పీస్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
3. మొత్తం కలగలుపుకొన్న తర్వాత ఒక బౌల్ లేదా ప్లేట్ లో వేసి అందులో చీజ్ తురుమును వేయాలి. అంతే పీస్ కార్న్ సలాడ్ రిసిపి రెడీ. హెల్తీ ఈవెనింగ్ స్నాక్...

No comments:

Post a Comment