Wednesday 20 August 2014

లాక్మే ఫ్యాషన్ వీక్ లో మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్...

 లాక్మే ఫ్యాషన్ వీక్ 2014 డే 2 అట్టహాసంగా ప్రారంభమైనది. మనం ఊహించినవిధంగానే, అర్చనా రావ్ ఫ్రూ..ఫ్రూ కలెక్షన్స్ కలర్ఫుల్ గా మరియు బ్రైట్ గా కనిపించాయి. ఆమె డిజైన్ చేసిన కలెక్షన్స్ లో ఎక్కువగా పోల్క, ఫ్లవర్ మరియు జింజాంటిక్ ప్రింట్స్ తో మొదటి షో చూడటానికి భయంకరంగా ఉన్నాయి. ఆమె కలెక్షన్స్ యొక్క థీమ్ ‘టీ.ఐఎస్ఎమ్' టీపార్టీలో చూడగలిగే అద్భుతమైన డిజైన్స్ అన్నీ ప్రేరేపించేవిధంగా ఉన్నాయి. ఈ అవుట్ ఫిట్స్ క్లియర్ కట్స్ మరియు పెన్సిల్ స్కర్ట్స్ చాలా అదంగా డిజైన్ చేశారు. ర్యాంప్ వాక్ లో కొన్ని విస్ట్ స్కర్ట్స్ ను కూడా జోడించారు. వీటికంటే స్టైల్ గా బెల్ట్ తో డిజైన్ చేసిన శారీలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. లాక్మే ఫ్యాషన్ వీక్ 2014లో చూసిన ఇతర డిజైన్లు కాకుండా, అర్చనా రావ్ ఎక్కవ ఆభరణాలను స్లింగ్ బ్యాగ్స్, టైట్ విస్టెడ్ బెల్ట్స్ నుండి జంక్ జ్యువెలరీ వరకూ ఎక్కువ ఆభరణాలను ఉపయోగించుకొన్నారు . లాక్మే ఫ్యాషన్ వీక్ 2014 లో ర్యాంప్ మీద ప్రదర్శించిన ఆమె కలెక్షన్స్ అన్నింటికి అందమైన షూలను కూడా చూడవచ్చు. అర్చనా రావ్ డిజైన్ చేసిన కలెక్షన్స్ లో అధునాతన ప్రింట్స్ మరియు రైంబో కలర్స్ ను వాడటం మనం గమనించవచ్చు. ఆమె ‘టీ.ఐఎస్ఎమ్'థీమ్ సేకరణలో ముఖ్యంగా బ్లూ, బేబీ సాఫ్ట్ పింక్ కలర్స్, గ్రేయిష్ బ్లాక్ మరియు సీగ్రీన్ ఎంపిక చేసుకొన్నారు . ఫ్యాబ్రిక్స్ కలిసిపోయాయి . అయితే, ఆమె లేస్ మరియు షీర్, కాటన్ వర్క్ చూపించడానికి ప్రయత్నించింది.

స్లీవ్ లెస్ పీచ్ కోట్:
 అర్చనా రావ్ తన కలెక్షన్స్ కు ఉపయోగించిన కలర్ కాంబినేషన్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. పీచ్ స్లీవ్ లెస్ విస్ట్ కోట్ వర్టికల్ స్ట్రిప్డ్ బ్లూ స్కర్ట్ మరియు క్రీమ్ ప్యాంట్ కనులకు కనువిందు చేసింది.

No comments:

Post a Comment