Wednesday 6 August 2014

అందాన్ని రెటింపు చేసే నైట్ బ్యూటీ హ్యాబిట్స్

ప్రస్తుత రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ప్రజలు తమ అందం, ఆరోగ్యం మీద అంతగా శ్రద్ద చూపలేకపోతున్నారు. ఒక తీవ్రమైన ఒత్తిడితో కూడిన ఆఫీస్ వర్క్, ఇంటిపనితో అలసిపోయిన వారికి, మరుసటి రోజు ఉత్సహాంగా ఉండటానికి కొంత విశ్రాంతి అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. కొన్ని నైట్ టైమ్ బ్యూటీ టిప్స్ ను అనుసరించడం ద్వారా మీరు మరుసటి రోజు పనికి సిద్దమవ్వడానికి విశ్రాంతిని మాత్రమే కాదు, ఎనర్జీని కూడా పొందగలరు. ప్రతి రోజు వివిధ రకాల పనులతో ఇంట, బయట ఒత్తిడితో మన అలసిన చర్మానికి కొంత విశ్రాంతి కలిగించడం చాలా అవసరం. కాబట్టి ప్రతి రోజో రాత్రి పడుకొనే ముందు తగినంత జాగ్రత్త తీసుకుంటే తప్పకుండా ఆరోగ్యకరమైన చర్మం పొందవచ్చు. రాత్రి సమయంలో తప్పకుండా పాటించాల్సిన కొన్ని చిట్కాలకు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటిని మీరు రెగ్యులర్ గా అనుసరించినట్లైతే తప్పకుండా మీరు రిఫ్రెష్ గా మరియు కాంతివంతంగా కనబడుతారు.
మేకప్ తొలగించాలి:
 నిద్రలేవగానే ఫ్రెష్ గా కనబడాలంటే, నిద్రించడానికి ముందు మేకప్ మొత్తాన్ని పూర్తిగా తొలగించాలి. మస్కార, లిప్ కలర్, ఫౌడేషన్ మొత్తాన్ని తొలగించాలి. చర్మం రంధ్రాలు ఫ్రీగా ఉండేలా చూసుకోవాలి.

No comments:

Post a Comment