Sunday 3 August 2014

హెయిర్ ఫాల్ తగ్గించి, జుట్టుపెరుగుదలకు

శిరోజాల ఆరోగ్యం మీ శారీరక ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడని ఆయుర్వేద వైద్యులు నిర్ధారిస్తుంటారు. ఒకవేళ జుట్టు రాలుతున్నట్లయితే శరీరంలో ఏదో అనారోగ్యం ఉన్నట్లుగా భావించాలి. సాధారణంగా జుట్టు రాలడానికి ఒత్తిడి, హార్మోనల్ డిజార్డర్స్, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, మందులు, జుట్టుకు వేసుకునే రంగులు, జన్యుపరమైన వ్యాధులు, స్మోకింగ్ వంటివి కారణమవుతాయి. అయితే రోజూ యోగా చేయడం ద్వారా జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యమైన జుట్టును సొంతం చేసుకోవడమే కాకుండా మొత్తం శరీర వ్యవస్థకు శారీరకంగా, మానసికంగా లాభం చేకూరుతుంది. యోగా వల్ల తలలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. జీర్ణశక్తి పెంపొందుతుంది. జుట్టు రాలే సమస్య ఉన్నట్లయితే కింది ఆసనాలు వేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
అధోముఖ శవాసన ఈ ఆసనం వేయడం వల్ల తలలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో జుత్తుకు బలం లభిస్తుంది. సైనస్, జలుబు వంటి సమస్యలున్నట్లయితే ఉపశమనం లభిస్తుంది. మానసిక అలసట దూరమవుతుంది. డిప్రెషన్, ఇన్సోమ్నియా వంటి స్లీపింగ్ డిజార్డర్స్ దూరమవుతాయి.

No comments:

Post a Comment