Sunday 13 September 2015

పెరుగుతో ఒత్తైన కురులు మీసొంతం...

జుట్టు సంరక్షణకు ఎన్ని కండీషనర్లు రాసుకున్నా మీ జుట్టు మళ్ళీ పొడిగానే తయారవుతోందా? జుట్టు చివర్లు చిట్లిపోయి.. జుట్టంతా డ్యామేజ్ అవుతోందా? చుండ్రుతో వెంట్రుకలు బలహీనమై ఎక్కువగా రాలిపోతున్నాయా? అయితే వీటన్నింటినీ పరిష్కరించడానికి ఓ సహజసిద్ధమైన మార్గం ఉంది. అదేంటంటే...‘పెరుగుతో హెయిర్ ప్యాక్స్'.
పెరుగులో ఉండే పోషకాలు జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేసి వెంట్రుకలకు బలాన్ని, మెరుపునూ ఇస్తాయి. అలాగే ఈ ప్యాక్స్ ఎండ, కాలుష్యాల నుంచి కూడా జుట్టును కాపాడడంలో సహాయపడుతాయి. ఈ క్రమంలో పెరుగుతో ఇంట్లోనే సులభంగా తయారుచేసుకొనే హెయిర్ ప్యాక్స్ ఏంటో చూసేద్దామా...
తేనెతో జుట్టుకు మంచి షైనింగ్: జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండాలంటే ఈ ప్యాక్ వేసుకోవడం మంచిది. కావల్సినవి: గడ్డపెరుగు : ఒక కప్పు, నిమ్మరసం: ఒక చెంచా, తేనె: ఒక చెంచా ప్యాక్ వేసుకోవడం ఇలా: ముందుగా గడ్డ పెరుగులో నిమ్మరసం, తేనె వేసి పేస్ట్ లాగా అయ్యేంత వరకూ కలుపుకోవాలి. ఈ మిశ్రామన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకూ అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేసి కండీషనర్ ను అప్లై చేయాలి. ఫలితంగా జుట్టుకు మెరుపు రావడంతో పాటు ఆరోగ్యంగా తయారవుతుంది. గుర్తుంచుకోవల్సినది: వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవచ్చు. తలస్నానానికి ఉపయోగించే షాంపూ తక్కువ గాఢత కలిగి ఉండేలా జాగ్రత్తపడాలి.

No comments:

Post a Comment