Wednesday 30 September 2015

మొటిమలు రావడానికి అనారోగ్య సమస్యలు కారణమా ?

చర్మం ఎంత అందంగా.. ఎంత కాంతివంతంగా ఉన్నా.. చిన్న మొటిమ చాలు.. ఎట్రాక్షన్ తగ్గిపోవడానికి. అందుకే ఏ చిన్న మొటిమ కనపడినా హైరానా పడిపోతుంటారు యువకులు. అయితే ముఖంపై మొటిమలు ఏ భాగంలో
ఎప్పుడు.. ఎందుకు వస్తాయో తెలుసుకుంటే.. అవి రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చు. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే చర్మ సౌందర్యం ఆధారపడి ఉంటుంది. సరైన సమయానికి.. సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అలాగే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు.. ఎక్కువ మోతాదులో మంచినీళ్లు తాగడం వల్ల చర్మంపై ఎలాంటి సమస్య ఉండదు. అయితే.. ముఖంపై ఏ భాగంలో మొటిమలు వస్తే..
నుదురు మొటిమలు, చిన్న చిన్న గుళ్లలు ఎక్కువగా నుదిటి భాగంలో కనిపిస్తుంటాయి. ఈ భాగంలో యువకులకే కాదు.. పెద్దవాళ్లలోనూ మొటిమల సమస్య ఉంటుంది. నిత్యం ఎక్కువ నీళ్లు తాగటం వల్ల.. ఇక్కడ మొటిమలు రావు. నుదురుపై మొటిమలు రావడానికి అజీర్తి, డీహైడ్రేషన్ కూడా కారణం. వేళకు ఆహారం తీసుకోవడం, పౌష్టికాహారం ఉండేలా చూసుకోవడం వల్ల మొటిమలకు చెక్ పెట్టవచ్చు.

No comments:

Post a Comment