Thursday 12 June 2014

ముఖం మీద బ్లాక్ హెడ్స్ కారణాలు

ముఖాన్ని అందవిహీనంగా మార్చేవాటిలో బ్లాక్‌హెడ్స్ ప్రధానమైనవి. సెబాషియస్ అనే గ్రంథి నూనె పదార్థాన్ని(సెబమ్) అధికంగా విడుదల
చేయడం వల్ల ఇవి ఏర్పడతాయి. చర్మానికి రంగునిచ్చే పిగ్మెంట్ ఎక్కువైనా ఈ సమస్య వస్తుంది. వెంటనే తగిన చికిత్స తీసుకుంటే వీటిని నివారించుకోవడమే కాకుండా అందాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ముఖం మీద బ్లాక్ హెడ్స్ ఏర్పడటానికి కారణాలు ఏంటో తెలుసుకొన్నట్లైతే బ్లాక్ హెడ్స్ రాకుండా నివారించుకోవడం పెద్ద సమస్య కాదు. మరి కారణాలేంటో కనుక్కుందాం.. ముఖం మీద బ్లాక్ హెడ్స్ కు ముఖ్య కారణాలు: 1. చర్మంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి వీలుగా సెబాషియస్ గ్రంథి నూనె పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఈ నూనె ఉత్పత్తి ఎక్కువైనప్పడు దానికి చర్మంలోని మలిన పదార్థాలు కూడా తోడయ్యి బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌గా ఏర్పడతాయి. 2. చర్మంలో బ్లాక్‌హెడ్స్ ఏర్పడడానికి దుమ్ముకూడా ఒక కారణం. చర్మంలో పేరుకున్న దుమ్ము కారణంగా బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనికి నూనెకూడా జత కావడంతో బ్లాక్‌హెడ్స్ ఏర్పడతాయి. కాబట్టి, బ్లాక్‌హెడ్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ గిల్లకూడదు. దీనివల్ల పరిస్థితి మరింత విషమిస్తుంది. గిల్లడం వల్ల చర్మంపై ఉన్న బ్యాక్టీరియా చర్మంలోపలికి చొచ్చుకుపోయి మరింత హాని చేస్తుంది.


No comments:

Post a Comment