Monday 9 June 2014

గోంగూర పచ్చడి...

వేసవిలో ఏ కూర చేసినా అంతగా తినాలని అనిపించదు. నీళ్లు మాత్రం గటగటా తాగేస్తాం. అయితే గొంగూర ఉంటే మాత్రం పుల్లగా...
పుల్లగా లాగించేస్తాం. ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర అంటే పడి చచ్చే వారు ఎందరో. అలాంటి గోంగూరతో చట్నీనే కాదు ఇతర వంటకాలు వండొచ్చు. గోంగూర పచ్చడి ఆంధ్రా స్టేట్ లో ఒక పాపులర్ సైడ్ డిష్ రిసిపి. ఒక్క ఆంధ్రాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గోంగూపచ్చడికి అత్యంత ప్రియులు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇష్టపడే గోంగూర పచ్చడి సౌత్ ఇండియన్ రిసిపిల్లో ప్రధానంగా ఉంటుంది. పుల్లపుల్లగా, కారంగా ఉండే ఈ గోంగూర పచ్చడి ఆంధ్రాలో తెలుగు వారు ఎక్కువగా రైస్ తో తింటారు. రైస్ కు నెయ్యి లేదా నూనె జోడించి, అన్నం తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది . ఒక్క రుచి మాత్రమే కాదు, ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గోంగూర ఆకుల్లో క్యాల్షియం, ఇనుము, విటమిన్‌ ‘ఎ', ‘సి', రైబోఫ్లెవిన్‌, ఫోలిక్‌యాసిడ్‌ మరియు పీచు ఎక్కువగా ఉంటుంది,. ఇందులో ఐరన్‌ అధికంగా ఉండడం వల్ల, కొంచెం ఎక్కువ తింటే అరక్కపోవడం కద్దు.
కావల్సిన పదార్థాలు: గోంగూర ఆకులు: 1/2పౌండ్స్ పచ్చిమిర్చి: 15-20(మీకు కారంకు సరిపడే విధంగా జోడించుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు) వెల్లుల్లి రెబ్బలు: 2 ఉల్లిపాయలుం 1/2మీడియం సైస్(సన్నగా తరిగి పెట్టుకోవాలి జీకలర్ర: 1tbsp ధనియాలు: 1/2tbsp శెనగపప్పు: 1tbsp నూనె: 2tbsp ఉప్పు : రుచికి సరిపడా 
తయారుచేయు విధానం: 
1. ముందుగా ఒక ఫ్రైయింగ్ పాన్ లో గోంగూర ఆకులు, పచ్చిమిర్చి, వేసి కొద్దిగా నీళ్ళు చిలకరించి 10-15నిముషాలు తక్కువ మంట మీద ఆవిరి మీద ఉడికించి తర్వాత చల్లార్చాలి. 
2. తర్వాత మీకు కారం సరిపోలేదు అనిపిస్తే సపరేట్ గా మరికొన్ని పచ్చిమిర్చి ఉడికించి, గోంగూరలో కలుపుకోవచ్చు. 
3. ఇప్పుడు ఉడికించుకొన్న పచ్చిమిర్చ వెల్లుల్లి, ధనియాలా, జీలకర్ర కొద్దిగా మరియు ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత అందులో గోంగూర ఆకులు కూడా వేసి మరో రెండు నిముషాలు గ్రైండ్ చేసుకోవాలి. 3. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, శెనగపపప్పు, కరివేపాకు, వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కుల, మరియు వెల్లుల్లి రెబ్బలు వేసి వ మరో రెండు మూడు నిముషాలు మీడియం మంట మీద వేగించుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 
4. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకొన్ని గోంగూర మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేసి వెంటనే స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఆంధ్రా స్టైల్ గోంగూర పచ్చడి రెడీ. ఇది రైస్ సాంబార్ కు సైడ్ డిష్ గా బెస్ట్ కాంబినేషన్ అలాగే ముద్దపప్పు, రైస్ కు కూడా బెస్ట్ కాంబినేషన్ .

No comments:

Post a Comment