Friday 20 June 2014

నిమ్మరసంతో బ్యూటిఫుల్ పింక్ లిప్స్ మీ సొంతం...

పెదాలను మరింత బ్యూటిఫుల్ గా కనబడేలా చేసే నిమ్మరసం పెదాలు అందంగా ఉంటే మీ ముఖ అందాన్నే బ్యూటిఫుల్ గా మరియు ఒక సెన్షేషన్ గా మార్చేస్తుంది.
ముఖ్యంగా పెదాలు పింక్ కలర్ లో నిండుగా కనిపిస్తుంటే మరింత అందం ముఖంలో ఇనుమడిస్తుంది. మహిళలు తమ అందం విషయంలో ముఖ్యంగా పెదాల అందం విషయంలో ఎల్లప్పుడూ పెదాలు నిండుగా పింక్ కలర్లో లేదా బ్లడ్ రెడ్ కలర్ లో చూడటానికి ఇష్టపడుతారు . కానీ, కొంత మంది స్మోక్ చేయడం మరియు జీవనశైలిలో అనేక మార్పులు, చెడు అలవాట్ల వల్ల చాలా మంది మహిళల్లో డార్క్ కలర్ పెదాలు లేదా పింగ్మెంట్ లిప్స్ ను కలిగి ఉంటారు. మరి ఈ డార్క్ లిప్స్ ను దాచేయాలంటే ఎప్పుడూ లిప్ కలర్స్ , లిప్ స్టిక్స్ అప్లై చేస్తుండాలి. అందుకోసం చాలా మంది మహిళలు ఎక్కువగా డార్క్ కలర్ లిప్స్ కలర్స్ ను ఉపయోగిస్తుంటారు. కానీ, ఈ లిప్ కలర్ ఉపయోగించడం అనేది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. పెదాల గురించి తగిన సంరక్షణ జాగ్రత్తలు తీసుకోవడానికి మరియు పిగ్మెంట్ లిప్స్ ను నివారించడానికి తగిని జాగ్రత్తలు తీసుకోవాలి . పెదాల నలుపు లేదా పిగ్మెంట్ ను నివారించడానికి నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది అంతే కాదు నిమ్మరసం చాలా సులభంగా అందుబాటులో ఉండే, చాలా తేలికగా మనకు దొరికే వస్తువు. కాబట్టి, ఈ ఆర్టికల్లో నిమ్మరసం ఉపయోగించి పెదాలకు ఎటువంటి హాని కలగకుండా పెదాలను లైట్ గా ఎలా మార్చుకోవాలో వివరించడం జరిగింది. నిమ్మరసంలో యాసిడ్స్ కలిగి ఉంటాయి, కాబట్టి నిమ్మరసాన్ని నేరుగా ఉపయోగించకూడదు. అందువల్ల పెదాల సంరక్షణలో భాగంగా నిమ్మరసంతో పాటు అదనంగా ఇతర పదార్థాలు కూడా అవసరం అవుతాయి. నిమ్మరసం మరియు గ్లిజరిన్: నిమ్మరసం కొంచె యాసిడ్ నేచర్ కలిగినది . నిమ్మరసంను నేరుగా ఉపయోగించడం వల్ల పెదాలు మరింత డ్రైగా మరియు పగినట్లుగా తయారవుతాయి. అందువల్ల, పెదాల నలుపును నివారించడం కోసం నిమ్మరసంతో పాటు గ్లిజరిన్ మిక్స్ చేసి పెదాలకు అప్లై చేసుకోవడం వల్ల పెదాలు లైట్ నలుపు మాయం అయ్యి లైట్ గా మరియు స్మూత్ గా మారుతాయి. కాబట్టి, ఇలాంటి బేసిక్ పదార్థాలతో పెదాల నలుపును నివారించవచ్చు. లెమన్ జ్యూస్ బామ్: పెదాల నలుపును నివారించడానికి నిమ్మరసాన్ని నేరుగా ఉపయోగించకూడదని ఇదివరకే మీకు సలహా ఇవ్వడం జరిగింది . నిమ్మరసాన్ని నేరుగా పెదాలకు అప్లై చేయకుండా ప్రత్యామ్నాయంగా నిమ్మరసంతో తయారుచేసిన లిప్ బామ్, లిప్ క్రీమ్, లిప్ జెల్స్ వంటివి ఉపయోగించవచ్చు. లెమన్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్స్ పెదాల పిగ్మెంట్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది . కాబట్టి పెదాల నలుపును నివారించడానికి మార్కెట్లో అందుబాటులో ఉండే లెమన్ ఎక్స్ట్రాక్ట్ లిప్ బామ్స్ మరియు లిప్ క్రీమ్ లను ఎంపిక చేసుకొని ఉపయోగించాలి. నిమ్మరసం -నెయ్యి: నెయ్యిని పెదవుల సంరక్షణాలో ఒకటిగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇది పెదాల పిగ్మెంటేషన్ ను తగ్గించదు, కానీ, పెదాలను నునుపుగా మార్చుతుంది. కాబట్టి, పెదాల నలుపు తగ్గించే నిమ్మరసంను రెండు మూడు చుక్కలు నెయ్యిలో వేసి బాగా మిక్స్ చేసి పెదాలకు అప్లై చేయాలి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా మంచి ఐడియా. ఇది పెదాలను సాప్ట్ గా మార్చడమే కాదు, పెదాల నలుపును తగ్గిస్తుంది. మరింత మంచి ఫలితం కోసం ఈ లిప్ కేర్ టిప్ ను రాత్రిల్లో పెదాలకు అప్లై చేసి, ఉదయం కడిగేయాలి. అయితే, రాత్రుల్లో మంటగా అనిపిస్తే వెంటనే కడిగేయాలి. లెమన్ అండ్ రోజ్ వాటర్: మరో సులభమైన మరియు చీప్ ట్రిక్ నిమ్మరసానికి కొద్దిగా రోజ్ వాటర్ అప్లై చేయాలి. లెమన్ జ్యూస్ పెదాలను లైట్ గా మార్చుతుంది. రోజ్ వాటర్ నిమ్మరసంలోని యాసిడ్ రిఫ్లెక్షన్ ను తగ్గిస్తుంది, దాంతో చల్లని అనుభూతి కూడా కలిగిస్తుంది. నిమ్మరసం: నిమ్మరసంలోని యాసిడ్ వల్ల ఇది పెదాల మీద ఎక్కువగా అప్లై చేయడం వల్ల పెదాలకు హాని కలిగించవచ్చు. పూర్తిగా నల్లగా లేకుండా చామనఛాయలో ఉన్నప్పుడు నిమ్మరసంలో కొద్దిగా నీరు మిక్స్ చేసి అప్లై చేయవచ్చు. పెదాలకు అప్లై చేసే ముందు కార్న్స్ లో కూడా అప్లై చేయాలి.

No comments:

Post a Comment