Saturday 28 June 2014

మహిళలు అనుసరించాల్సిన మార్నింగ్ బ్యూటి టిప్స్

ప్రతి రోజూ నిద్రలేవగానే మీరేంచేస్తారు?అందంగా అలంకరించుకోవడానికి మీకు సరిపడా సమయం ఉందా?లేదా మీరు మీకోసం ఏమైనా చేసుకోవడానికి సమయం
లేక చాలా బిజీగా ఉన్నారా?ఎంత బిజీగా ఉన్నా మన ఆరోగ్యం మరియు చర్మం సంరక్షణకోసం తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యం మీద మరియు చర్మ సంరక్షణ మీద ఎక్కువగా ఉదయం సమయంలో ఎక్కువ శ్రద్ద తీసుకోవల్సి ఉంటుంది. రోజంతా ఫ్రెష్ గా మరియు ఫర్ ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటున్నట్లైతే, మీ చర్మం ప్రకాశవంతంగా, ఫ్రెష్ గా కొన్ని పద్ధతులను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. ఈ ఆర్టికల్ బిజీగా ఉన్నా, బిజీగా లేకున్నా ఏవరికైనా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మరి ఆ పద్దతులేంటో ఒకసారి చూద్దాం... 1. మీ శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి మరియు ఫ్రెష్ గా స్నానం చేయాలి: ప్రతి రోజూ ఉదయం తప్పనిసరిగా ఒక కప్పు గ్రీన్ టీతో, కొన్ని సులభ మరియు సింపుల్ వ్యాయామాలు చేయాలి. స్పాంజ్ బాత్ ఫ్లవర్ సెంట్ షవర్ జెల్ తో స్నానం చేయడం. ప్రతిఒక్క మహిళ మార్నింగ్ అనుసరించాల్సిన బ్యూటీటిప్స్ లో ఇది ఒకటి. ఇది ఉదయం అనుసరించాల్సిన బ్యూటి టిప్స్ లో ఖచ్చింతగా అనుసరించాల్సిన మొదటి పద్దతి ఇది. వ్యాయామం తర్వాత స్నానం అనేది మిమ్మల్ని రిలాక్స్ గా మార్చుతుంది. 2. మరో మార్నింగ్ బ్యూటీ టిప్ మాయిశ్చరైజింగ్: ప్రతి రోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. మీ చర్మాన్ని రోజంతా సాఫ్ట్ గా మరియు హైడ్రేషన్ లో ఉంచడం చాలా అవసరం. స్నానం చేసిన 10నిముషాల్లోపే మాయిశ్చరైజ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి, spf కలిగిన మంచి మాయిశ్చరైజర్ ను ఎంపిక చేసుకోండి. 3. శుభ్రంగా ఉతికిన దుస్తులను ఉపయోగించాలి: శుభ్రంగా ఉతికిన దుస్తులనే ఉపయోగించాలి.ఫేస్ లో మరింత గ్లో కనిపించాలంటే, బాగా శుభ్రం చేసిన కాటన్ వస్త్రాన్నిలేదా టవల్ ను గోరువెచ్చని నీటిలో వేసి డిప్ చేసి, బయటకు తీసి నీరు పిండేసి ఆ టవల్ ను ముఖం మీద కొద్దిసేపు వేసుకోవాలి. ఇది ముఖాన్ని శుభ్రం చేయడంతో పాటు, తెరుచుకొన్న రంధ్రాలను మూసుకొనేలా చేస్తుంది. దాంతో చర్మం చూడటానికి కాంతి వంతంగా కనబడుతుంది. వేడి టవల్ తో ముఖాన్ని తుడిచిన తర్వాత ఒక మంచి నాణ్యమైన ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేయాలి . 4. ఫేషియల్ హెయిర్ : రెగ్యులర్ గా ట్రిమ్ చేయడం మరియు థ్రెడ్డింగ్ చేసి ఫేషియల్ హెయిర్ తొలగించడం వల్ల చూడటానికి అందంగా ఉంటుంది. ప్రతి రోజూ ఐబ్రో పెరుగుదలను చెక్ చేయాలి. అదనంగా ఉన్నట్లైతే ప్లక్కర్ తో ట్రిమ్ చేసుకోవాలి. ఇదికూడా మహిళల కోసం ఒక మార్నింగ్ బ్యూటీ టిప్. 5. త్వరగా మేకప్: మార్నింగ్ మేకప్ టిప్స్ లో ఇది కూడా ఒకటి. మినిమమ్ మేకప్ ప్రతి మహిళకు అవసరం. అందుకు మీరు చేయాల్సిందల్లా బేబీక్రీమ్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల మీ ముఖం మరింత కాంతివంతంగా కనబడేలా చేస్తుంది. తర్వాత పెదాలకు లిప్ బామ్ అప్లై చేయడం లేదా లిప్ కలర్ అప్లై చేయడం చాలా అవసరం. 6. జుట్టు: మార్నింగ్ బ్యూటి టిప్స్ లో ఉత్తమైన మరో పద్దతి, మీ జుట్టును సౌకర్యవంతంగా బన్ వేసుకోవాలి . మీ జుట్టు అందంగా అలంకరించుకోవాలి.


No comments:

Post a Comment