Wednesday 4 June 2014

స్పైసీ బంజార మటన్ కర్రీ

బంజార మటన్ కర్రీ. ఈ వంటను హైదరాబాదీ స్టైల్లో తయారుచేస్తారు. మసాలా లేకుండా మొత్తం పొడులతోనే తయారుచేసే ఈ బంజార
మటన్ కర్రీ మంచి ఫ్లేవర్ తో పాటు రుచికరంగా ఉంటుంది.. ఈ బంజారా మటన్ కర్రీ రిసిపి చాలా సింపుల్ గా, సులభంగా తయారుచేసుకోవచ్చు . ఈ బంజార మటన్ కర్రీని మేక మాంసంతో తయారుచేస్తారు. ఈ టేస్టీ బంజార మటన్ కర్రీ రోటి, చపాతీ మరియు రైస్ కు బెస్ట్ కాంబినేషన్. మరి ఈ బంజార మటన్ కర్రీని ఎలా తయారుచేయాలో చూద్దాం..

కావల్సిన పదార్థాలు: మటన్ : 
500grms టమోటాలు : 150grms ఉల్లిపాయలు : 50grms యాలకులు: 2 లవంగాలు: 4 దాల్చిన చెక్క: చిన్న ముక్క నూనె : 50grms గరంమసాలా : 2grms పచ్చిమిర్చి : 4 అల్లం : చిన్న ముక్క ధనియాల : 2tsp ఎండుమిర్చి : 3 ఎండుమెంతికూర : 1tsp ఉప్పు : రుచికి తగినంత 

తయారు చేయువిధానం : 1. ముందుగా మటన్ ని శుభ్రంగా కడిగి గిన్నెలో వేసి కొంచెం ఉప్పు, గరం మసాలా కలిపి మెత్తగా ఉడికించాలి. 2. ఒక గిన్నె లో నూనె పోసి కగాక సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని ఎర్రగా వేయించండి. 3. తరువాత పచ్చిమిర్చి, అల్లం ముక్కులు వేసి కొద్ది సేపు ఫ్రై చేయండి, తరువాత దంచిన ధనియాలు, ఎండుమిర్చి కలిపి, ఉడికించిన మాంసాన్ని కూడా వేయండి. 4. ఈ మిశ్రమంలో టమోటా ముక్కల్ని వేసి సన్నని మంట మీద గ్రేవీ పూర్తిగా ఉడికే వరకూ వుంచి ఉప్పు సరి చూడండి, ఇప్పుడు దానిమీద మెంతికూర జల్లితే బంజార మటన్ రెడీ.

No comments:

Post a Comment