Saturday 22 August 2015

చర్మ సౌందర్యాన్ని పెంచే

మసాజ్ లాగే ఫేషియల్ మసాజ్ యూడా చాలా అవసరం. చర్మం అందంగా.. ఆరోగ్యంగా మెరుస్తుండేందుకు బ్యూటీ పద్దతుల్లో చాలా రకాలను ప్రయత్నం చేసే ఉంటారు. అయితే ఫేషియల్ మసాజ్ అనేది చర్మ సంరక్షణలో చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వయస్సులో ఏదో ఒక చర్మ సమస్యను ఎదుర్కొని ఉంటారు. వయస్సు
మీదపడినట్లు, ముడుతలు, ముఖంలో మొటిమలు, బ్లాక్ సర్కిల్స్, మొ..ఎన్నో..అలాంటి వారిలో మీరూ ఒక్కరైతే.. మీ ముఖం నిర్జీవంగా, కాంతిహీనంగా ఉందా? ముఖంలో కళ తప్పినట్లైతే మళ్లీ చర్మానికి కాంతి చేకూర్చాలని ఉందా. ఈ సమస్యలన్నింటీకి ఒకటే మార్గం అదే ఫేషియల్ మసాజ్. ఫేషియల్ మసాజ్ వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మరియు ముఖలో స్కార్స్, స్కిన్ మార్క్స్ మరియు స్పాట్స్ నివారించబడుతుంది ఫేషియల్ మసాజ్ వల్ల ముఖంలో నేచురల్ గ్లో వస్తుంది . ఫేషియల్ మసాజ్ కోసం ఉపయోగించే నేచురల్ ప్రొడక్ట్స్ మఖ చర్మంలోనికి షోషింపబడి లోపలి నుండి న్యూరిష్ చేస్తుంది.
ఫేషియల్ మసాజ్ తో సర్ఫ్రైజింగ్ బ్యూటి బెనిఫిట్స్ ఫేషియల్ మసాజ్ కోసం వివిధ రకాల క్రీమలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి కంటే మనం నేచురల్ గా హోం మేడ్ మసాజ్ క్రీమ్ లను తయారుచేసుకొని ఉపయోగించడం ద్వారా అవి సురక్షితమైనవి, చౌకనివి మరియు మరియు ప్రయోజనాలను అందిస్తాయి. కాబట్టి ఫేషియల్ మసాజ్ కోసం కొన్ని ఎఫెక్టివ్ హోం మేడ్ క్రీములను మీకు పరిచయం చేస్తున్నాము. ఇవి మీ ముఖంలో ముడుతలు, మచ్చలు తొలగించి మిమ్మల్ని యంగ్ గా కనబడేలా చేయతాయి. ఈ మసాజ్ క్రీములను ముఖానికి పట్టించి సర్కులర్ మోషన్ లో మసాజ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముక్కు మెడ వద్ద కూడా 15-30 నిముషాలు మసాజ్ చేసుకోవాలి.

No comments:

Post a Comment