Wednesday 26 August 2015

విటమిన్ కె ఆహారాలు

విటమిన్‌ కె : ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం విటమిన్ కెను మన రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవల్సి ఇక ముఖ్యమైన విటమిన్ ఇది. ఇది కొవ్వులో కరిగే విటమిను. రక్తము గడ్డకట్టుటలో ఉపయోగపడే ఒక ఫేక్టర్. మరియు విటమిన్ కె వల్ల మరో ప్రధానమైనటువంటి పాత్ర ఎముక మరియు ఇతర కణజాలము లో కొన్ని
జీవక్రియలకు సహకరింస్తుంది మరియు ఎముకలకు మరియు కండరాలకు తగినంత బలాన్ని చేకూర్చుతుంది. మరియు ఇది అన్ని రకాల వ్యాధుల నుండి గుండెను రక్షిస్తుంది. విటమిన్స్ లో చాలా మంది ఈ విటమిన్ కె గురించి మర్చిపోతుంటారు. విటమిన్స్ అనగానే, విటమిన్స్ లో ప్రతి ఒక్క విటమిన్ ఆరోగ్యాన్ని ఉపయోగపడేవని గుర్తించాలి. విటమిన్ కె లో విటమిన్‌ కె1 , విటమిన్‌ కె2 అని రెండు రకాలు. విటమిన్‌ కె1 ని విటమిన్‌ కెజె (ఫిల్లొక్వినోన్‌) అని కూడా పులుస్తారు. విటమిన్‌ కె1 - మొక్కలలో తయారవును. అన్ని ఆకుపచ్చని ఆకుకూరలలోను, సోయాబీన్‌ లలోను లభించును. మానవ చిన్నపేగులలో బాక్టీరియా విటమిన్‌ కె1 ను విటమిన్‌ కె2 గా మార్చుతు ఉండును. విటమిన్‌ కె2 ఎముకల జీవపక్రియలో సహాయపడును. విటమిన్‌-కె కుత్రిమ తయారీ రకాలు లో కె3 , కె4 ,కె5 లు ఉన్నాయి. కె1, కె2 విటమిన్లు హానికరము కావు. కుత్రిమ తయారీ విటమిన్లు కె3 (menadione) కొంతవరకు హానికరమని చెప్పబడుతున్నది.
రక్తం గడ్డకట్టకుండా గుండెను కాపాడే విటమిన్ కె ఆరోగ్యకరమైన బోన్స్ కలిగి ఉండాలంటే విటమిన్ కె ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. విటమిక్ కె లోపమున్న వారిలో బోన్ ఫ్రాక్చర్ అయ్యే ప్రమాధం ఎక్కువగా ఉంది . అలాగే ఇది క్యాన్సర్ సెల్స్ వ్రుద్ది చెందకుండా శరీరానికి కాపాడుతుంది. రీసెంట్ గా విటమిన్ కెను విటమిన్ డిగా గుర్తించడం జరిగింది. ఎందుకంటే విటమిన్ కె మరియు విటమిన్ డి రెండింటిలోనూ ఒకే విధమైన కాంపోనెంట్స్ కలిగి ఉంటాయి. ఆరోగ్యం విషయంలో విటమిన్ డి'ది కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి విటమిన్ డి పొందాలన్నా, విటమిన్ కె ఆహారాలను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

No comments:

Post a Comment