Friday 11 April 2014

ముడుతలతో బాధపడుతున్నారా?

శరీరంలో ఎక్కడ ముడతలు కనిపించినా పెద్దగా ఎవరూ పట్టించుకోరు కానీ, ముఖం మీద ముడుతలు ఏర్పడితే మాత్రం మానసికంగా ఆందోళన పడిపోతారు. ఇందులో ఆడవారు, మగవారు అనే తేడా లేదు. ఇంచుమించు ఈ విషయంలో ఇద్దరి భావాలు ఒకే విధంగా ఉంటాయి. ముఖం మీద ముడుతలు కనిపిస్తే వయసు మళ్ళిందని బెంగపడిపోతారు. టివిలో, పేపర్‌ లో వచ్చే ప్రకటలను చూసి వందల రూపాయలు ఖర్చుచేస్తున్నారే తప్ప వాటివల్ల ఎంతవరకు ప్రయోజనం కలుగుతుందనేది మాత్రం ప్రశ్నగానే మిగిలి పోతోంది. అందుకే కృత్రిమంగా తయారు చేసే క్రీములపై ఆధారపడడం కంటే సహజసిద్ధంగా తయారయ్యే పండ్లు, నట్స్‌ తో కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు. మనం నిత్యం ఉపయోగించే పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. కేవలం శరీరానికి శక్తి నివ్వడమే కాక చర్మానికి మంచి కాంతి తేవడంలో ఇవి ఎంతగానో దోహదపడుతాయి. డ్రై స్కిన్, విపరీతమైన ఒత్తిడి... విటమిన్ల లోపం... నిద్రలేమి... అధిక పొట్ట... వివిధ కారణాల వల్ల చిన్న వయసులోనే చర్మంపై ముడతలు వస్తాయి. ఇవి ముఖ వర్ఛస్సును పోగొట్టడమే కాదు... వయసుపైబడిన వారిలా కనిపించేలా చేస్తాయి. మరి ముఖంపై ముడతలను నివారించాలంటే ఏం చేయాలో చూద్దాం..
బొప్పాయి: 
తాజా బొప్పాయి పండు గుజ్జును తీసుకుని ఐదు నిమిషాల పాటు ముఖానికి అప్లై చేయండి. అలా పదిహేను నిమిషాల పాటు ఉంచి తరువాత చల్లని నీటితో కడిగేయండి. మంచి ఫలితం ఉంటుంది. బొప్పాయిని తినడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది.

No comments:

Post a Comment