Thursday 3 April 2014

ఇప్పటికిప్పుడు అందంగా కనబడాలంటే

సాధారణంగా కొంత మందిని చూస్తే మంచి లక్షణాలతో లేదా మంచి ఆరోగ్యంతో ఎల్లప్పుడు నేచురల్ గానే ప్రకాశించే చర్మ సౌందర్యంను కలిగి ఉంటారు . అటువంటి వారిని చూసిన
వారెవరైనా సరే వారు, ఈర్శపడుతుంటారు. వారు ఎంత లక్కీ మనం ఎందుకు అంత అందంగా లేమని ఆలోచిస్తుంటారు. ఒక స్వచ్చమైన, ఆరోగ్యంమైన మరియు ప్రకాశించే చర్మం ఎల్లప్పుడు స్టైల్ గా మరియు చూడటానికి అందంగా కనబడుతారు. అటువంటి అందమైన ప్రకాశించే చర్మంను మీరు కూడా వెంటనే పొందాలని అనుకుంటే కొన్ని డిఫరెంట్ పద్దతులను అనుసరించి, అటువంటి చర్మం సౌందర్యంను మీరు కూడా పొందవచ్చు. అటువంటి ప్రకాశవంతమైన చర్మ సౌందర్యం పొందడానికి ఎక్కువ సమయం మీరు అనుసరించాల్సిన పనిలేదు. ఈ చిన్న బ్యూటీ బూస్టింగ్ చిట్కాలను పాటిస్తే చాలు, మీ సాధరణ సమస్యలైనటువంటి పఫీ ఐస్, ఆయిల్ హెయిర్ మరియు రేడియంట్ స్కిన్ వంటి సమస్యలను మీరు సరిదిద్దుకోవచ్చు.
మీ ముఖం ప్రకాశించేలా చేయడానికి మీరు చూడటానికి అందంగా, ప్రకాశించే చర్మంతో కనబడాలంటే ఒక ఉత్తమ మార్గం ఉంది. అందుకు మీరు కొద్దిగా మాయిశ్చరైజర్ తీసుకొని మీ కళ్ళ మీద, కళ్ళ చుట్టూ మాయిశ్చరైజ్ రాశి సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత లైట్ రిఫ్లెక్టింగ్ కన్సీలర్ ను అప్లై చేయాలి . ఎల్లో కలర్ లో ఉండే కన్సీలర్ ను కళ్ళకు రాయడం వల్ల కళ్ళ క్రింద చారలను కనబడనియ్యకుండా చేస్తుంది . మీ కళ్ళకు కన్సీలర్ ను అప్లై చేసిన తర్వాత నార్మల్ మేకప్ ను అప్లై చేసుకోవచ్చు.

No comments:

Post a Comment