Thursday 17 April 2014

వేసవిలో చర్మ సౌందర్యాన్ని రెట్టింపు వాటర్ మెలోన్...

పుచ్చకాయ (Watermelon) నే కర్బూజా అని కూడా అంటారు. ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. మండే ఎండల్లో
పుచ్చకాయ తింటే ఎంత చల్లగా ఉంటుందో, దానిని ముఖానికి రాసుకుంటే అంత హాయిగా ఉంటుంది. ముఖాన్ని తాజాగా ఉంచడానికి అదెంతో ఉపయోగపడుతుంది. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నా ఈ కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచీ ఎక్కువ. బి విటమిన్లు , పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే.. పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. అందరూ అనుకున్నట్లు పుచ్చకాయ వేసవి తాపాన్ని తేర్చే ఒక జూసీ ఫ్రూట్ మాత్రమే కాదు, మన చర్మ సంరక్షణలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని వేడి నుంచి రక్షిస్తూనే చర్మ వ్యాధులు సోకకుండా ఒక మంచి మందులా ఉపయోగపడుతుంది. ఇందులో 93% నీటి నిల్వలతో పాటుగా మల్టీవిటమిన్లు విటమిన్ A, విటమిన్ B6 మరియు విటమిన్ C లు సమృద్ధిగా ఉన్నాయి. ఇది మన చర్మం యొక్క దాహాన్ని తీర్చి శాంత పరచడమే కాకుండా, వేడి వల్ల చర్మంలో చిన్న చిన్న సమస్యలు ఉన్ననూ శుభ్రం చేసి సంరక్షిస్తుంది.

చర్మ సంరక్షణకు కాయలో యాంటీ ఆక్సిడెంట్‌గుణాలు అధికం. అందుకే హానికారక ఫ్రీరాడికల్స్‌ను అద్భుతంగా ఎదుర్కొంటుంది. ఎండల్లో చర్మం వడదెబ్బ బారినపడి కమిలిపోకుండా రక్షిస్తుంది. మెరిసే చర్మాన్ని అందిస్తుంది. అంతే కాదు ఇందులో బ్యూటీ మరియు స్కిన్ బెనిఫిట్స్ పుష్కలంగా ఉన్నాయి. వాటర్ మెలోన్ జ్యూసీ ఫ్రూట్ కాబట్టి శరీరాన్ని ఎప్పడూ తేమగా ఉంచుతుంది. మీరు కనక పొడి చర్మంతో బాధపడుతున్నట్లైతే వాటర్ మెలోన్ మీద తేనె చిలకరించి ముఖానికి మాయిశ్చరైజ్ చేసుకోవాలి. డీహైడ్రేషన్ వల్ల ముఖం డల్ గా మరియు డ్రైగా ఉంచుతుంది. కాట్టి ఈ జ్యూస్ రెడ్ ఫ్రూట్ ను మీ డైలీ డైయట్ లో చేర్చుకోండి.

No comments:

Post a Comment