Friday 25 April 2014

కీరదోసకాయ బాగా సహాయపడును....

బయట ఎండలు మండుతున్నాయి. ఎండవేడికి శరీరంలో నీరంత చెమట రూపంలో బటయకు వచ్చేస్తుంది. దాంతో శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. దాంతో పాటు, చర్మ సమస్యలు,
వడదెబ్బ, డయేరియా వంటి సమస్యలు అధికం అవుతాయి. వీటి బారీ నుండి మన శరీరాన్ని రక్షించుకోవాలంటే వేసవిలో చల్లచల్లగా ఏదైనా కూల్ డ్రింక్స్ తప్పనిసరిగా తీసుకుంటుండాలి. వేసవిలో శరీరంలో నీటిని బ్యాలెన్స్ చేయడానికి కీరదోసకాయ బాగా సహాయపడుతుంది. డీహైడ్రేసన్ తగ్గిస్తుంది. వేసవికి జింజర్, కుకుంబర్ జ్యూస్ ఫర్ ఫెక్ట్ సమ్మర్ డ్రింక్ . మన శరీరాన్ని చల్లబరుస్తుంది. అల్లంలో ఉండే మెడిసినల్ వాల్యూస్ అనేక వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. మరి ఈ రెండింటి కాంబినేషన్లో జ్యూస్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు: కీరదోసకాయ: 1(సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) అల్లం: కొద్దిగా పంచదార: 1tsp జీలకర్ర పొడి 1/2tsp బ్లాక్ సాల్ట్: 1/2tsp నీళ్ళు: 1cup 
తయారుచేయు విధానం: 
1. ముందుగా అల్లం మరియు కీరదోసకాయకు పొట్టు తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. (మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి) 
2. తర్వాత ఈ పేస్ట్ ను ఒక పెద్ద బౌల్లో పోసి మీకు అవసరం అయినన్ని నీళ్ళు కలుపుకోవచ్చు. 
3. తర్వాత ఇందులో బ్లాక్ సాల్ట్, పంచదార మరియు జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే జ్యూస్ గ్లాసుల్లో పోసి, వెంటనే సర్వ్ చేయాలి. ఈ రిఫ్రెషింగ్ డ్రింక్ వేసవి తాపాని తీర్చుతుంది. శరీరానికి చల్లదనం అందిస్తుంది.

No comments:

Post a Comment