Friday 17 April 2015

కన్వర్టబుల్ కాఫీ టేబుల్

మన పెద్దవాళ్ళు ఒక సామెత చెబుతుంటారు. అదేంటంటే, మంచి పొడవును బట్టి కాళ్ళు మడుచుకోవాలంటారు. అలాగే ఇల్లు చిన్నదిగా ఉంటే ఫర్నిచర్ ను కూడా అలాగే మలుచుకోవాలి. మనం అమర్చుకొనే ఫర్నిచర్ తక్కువ
స్థలాన్ని ఆక్రమించాలి. ఫర్నీచర్ మనకు రెండు విధాలుగా ఉపయోగపడే విధంగా ఉండాలి. అలాంటి మల్టీపర్పస్ ఫర్నీచర్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవక తప్పదు. తెలుసుకోవడం మాత్రమే కాదు మీ ఇంటికి మరియు మీకు రెండు విధాలుగా సహాయపడే ఈ ఫర్నీచర్ ను ఎంపిక చేసి మీ ఇంట్లో అమర్చు కోవచ్చు. 

1. కన్వర్టబుల్ కాఫీ టేబుల్: డైనింగ్ టేబుల్ కోసం తగినంత స్థలం లేకపోతే కన్వర్టిబుల్ కాఫీ టేబుల్ ను ఎంపి చేసుకోవాలి. ఇది భోజనం టేబుల్, కాఫీ టేబుల్ గా రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. డైనింగ్ టేబుల్ ఎత్తుకు పైకి లేవటానికి, కాఫీ టేబుల్ లా కిందికి దిగడానికి దీనిలో హైడ్రాలిక్స్ ఉంటాయి. వీటి సహాయంతో పైకి కిందికీ వీలుండే, విడిగా విడిపోయే వివిధ సైజుల్లోని టేబుల్స్ ఒకటిగా కలిసి ఉంటాయి. ఈచిన్న సైజు కన్వర్టిబుల్ టేబుల్ ను ఎంచుకుంటే వేర్వేరు అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు.


No comments:

Post a Comment