Saturday 25 April 2015

సైడ్ ఎఫెక్ట్ ... ఎగ్ వైట్ మంచిదంటారు కానీ ఆశ్చర్యం

మీరు ప్రతి రోజు గుడ్డు తెల్ల సొనను తింటున్నారా? అది మీకు అందించే ప్రయోజనాల గురించి చాలా తెలుసు. కానీ దుష్ప్రభావాలు గురించి ఏమి తెలుసు? అవును. గుడ్డు తెల్లసొన వలన దుష్ప్రభావాలు ఉన్నాయి. మీరు వాటి
గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా. అయితే ఈ పోస్ట్ ను చదవండి. తెల్ల సోన తింటే చాలా మంచిదనే భావనలో మీరు ఉన్నారా. గుడ్డు ఆరోగ్యకరముగాను మరియు రుచికరముగా ఉంటుంది. అయితే వాటిలో ఉండే అల్బుమిన్ అనేది మీ శరీరం మీద ప్రతికూలంగా ప్రభావితం చేసే కొద్ది దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇక్కడ గుడ్డు తెల్లసొన యొక్క దుష్ప్రభావాలు కొన్ని ఉన్నాయి. ఒక లుక్ వేయండి. 
1. సాల్మొనెల్లాతో ఎక్కువ రిస్క్ 

పచ్చి గుడ్డు,తెల్లసొన అనేవి బ్యాక్టీరియా ద్వారా కలుషితం అవుతాయి. సాల్మోనెల్లా అనే బాక్టీరియా కోళ్ల ప్రేగులలో కనిపిస్తుంది.ఇది పగలగోట్టని గుడ్డు బయట ఉపరితలం మరియు గుడ్డు లోపల కూడా ఉంటుంది. సాల్మొనెల్ల నాశనం చేయడానికి, ఎక్కువ సమయం మరియు ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికించాలి. ఎండ వైపు మరియు సాఫ్ట్ గా ఉడికించిన గుడ్లలో జీవించి ఉన్న బాక్టీరియా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 
2. బయోటిన్ యొక్క క్షీణత 

మృదువైన గుడ్డు తెల్లసొన తినటం వలన బయోటిన్ క్షిణించవచ్చు. బయోటిన్ విటమిన్ H లేదా విటమిన్ B7 గా ఉంటుంది. బయోటిన్ కొరత వలన శిశువుల్లో క్రెడిల్ టాప్ చర్మ పరిస్థితులకు కారణమవుతుంది. అదే పెద్దలలో అయితే అమిత చెమట స్రావము వల్ల దద్దుర్లకు కారణం అవుతుంది. బయోటిన్ లోపం వలన శరీరము టోన్ మరియు సమన్వయం లేకపోవడం, నొప్పి మరియు కండరములు తిమ్మిరి, అనారోగ్యాలు మరియు జుట్టు నష్టం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. 
పచ్చి అల్బుమిన్ లో అవిదిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది మీ శరీరం నుండి బయోటిన్ ను తొలగిస్తుంది. అయితే ఇది విష పదార్ధం కాదు. మీరు క్రమం తప్పకుండా మృదువైన తెలుపు గుడ్లును తిన్నప్పుడు, మీ శరీరానికి అవసరమైన బోయతిన్ ను అవిదిన్ తొలగించటం జరుగుతుంది. దీని పలితంగా కొన్ని వారాలలో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు కీలకంగా మారి తీవ్రమైన అనారోగ్యానికి దారి తీస్తుంది. 
3. అలర్జీలు 

అనేక సందర్భాల్లో, గుడ్డు తెల్లసొన పడని వ్యక్తులకి కూడా ప్రోటీన్లు అల్బుమిన్ పడదు. దీని వలన తిమ్మిరి,శ్వాసలో గురక,వాంతులు,దగ్గు,తుమ్ములు, చర్మం, వికారం, విరేచనాలు వాపు దద్దుర్లు, దద్దుర్లు వంటి అలెర్జీ లక్షణాలు కనపడతాయి. 
4. ప్రోటీన్లు ఎక్కువైతే 

మీరు మూత్రపిండాల సమస్యలతో బాధపడుతూ ఉంటే, ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో తినడం ప్రమాదకరంగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. ప్రజలు తక్కువ గ్లిమోరులర్ వడపోత రేటుతో (GFR అంటే కిడ్నీ ఫిల్టర్లు ద్రవం యొక్క ప్రవాహం రేటు) ఉంటారు. ఎందుకంటే గుడ్డు ప్రోటీన్ అధిక జీవ విలువ వలన తీవ్రమైన మూత్రపిండ గాయంనకు గురి కావచ్చు. బలహీనమైన మూత్రపిండాల పనితీరుతో బాధపడుతున్న వ్యక్తులు ప్రతి రోజు 0.6 - 0.8 గ్రాముల ప్రోటీన్ తీసుకోవటానికి సిఫార్సు చేయబడింది. అయినప్పటికీ, GFR తక్కువ ఉన్న వారు గుడ్డు నుంచి వచ్చే 60% ప్రోటీన్ తీసుకోవచ్చని వైద్యులు చెప్పుతారు. మీకు తీవ్రమైన కాలేయ సమస్యలు ఉంటే గుడ్డు తినటానికి ముందు మీ వైద్యుడుని సంప్రదించడం అత్యంత ముఖ్యం.

No comments:

Post a Comment