Tuesday 21 April 2015

జామకాయల్లో పోషకాల గురించి విన్నారా?

బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుండే జామకాయలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి . రుచిగా ఉండే జామపండును లేదా జామకాయను తింటాం. కానీ జామ ఆకు గురించి ఎప్పుడయినా ఆలోచించారా?
వాటిల్లో ఉండే పోషకాల గురించి విన్నారా? ఈ ఆకుల్లో పలు ఆరోగ్య సమస్యలు రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నిజానికి జామకాయలో కంటే జామ ఆకుల్లోనే ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. ముఖంగా జామఆకుల్లో ఆరోగ్య ప్రయోజనాలను చూసినట్లైతే జామఆకుల్లో నొప్పులూ, వాపులను నివారించే గుణాలూ అధికమే! జామాకు టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. జలుబూ, దగ్గూ నెమ్మదిస్తాయి. శుభ్రంగా కడిగిన జామాకులను నమలడం వల్ల పంటి నొప్పులు దూరమవుతాయి. చిగుళ్ల నొప్పీ, నోటిపూతా తగ్గుతాయి. వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. ఇన్ని ఆరోగ్యప్రయోజనాలకు ప్రధాణ కారణం జామ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరయు విటమిన్ సి. అంతే కాదు ఈ ఆకుల్లో క్వర్సిటిన్, ఫ్లవనోల్ అనే శరీరానికి అవసరం అయ్యే మంచి ఫ్లెవనాయిడ్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. జామ ఆకులు, బెరడు నుంచి తయారు చేసిన పదార్థాలు కేన్సర్‌, బాక్టీరియా ద్వారా వచ్చే అంటు వ్యాధులు, వాపులు మరియు నొప్పి నివారణలో వైద్యంగా వాడుతున్నారు. ఈ జామాకుల నుంచి తయారు చేసిన నూనెలు కేర్సర్‌లు విరుద్ధంగా పనిచేస్తున్నాయి. ఈ జామ ఆకులను నాటు వైద్యంగా డయేరియాకి మందుగా ఉపయోగిస్తారు. బెరడు ఏంటీ మైక్రోబియల్‌, ఏస్ట్రింజంట్‌ లక్షణాన్ని కలిగి ఉంటుంది. వీటిని చక్కెర వ్యాధి తగ్గించడంలో కూడా ఉపయోగిస్తారు. కొన్ని దేశాల్లో జామ పండు పై తొక్క తొలగించి పంచదార పాకం పట్టి ఎరుపు రంగు కలిపి రెడ్ గోవా అనే పేరుతో విక్రయిస్తారు. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలున్న జామఆకులు ఏవిధంగా ఉపయోగించాలంటే టీ రూపంలో తీసుకుంటే మరింత ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. మరి జామ ఆకు టీ ఎలా తయారుచేయాలో చూద్దాం...నీటిని మరిగించి, శుభ్రంగా కడిగిన జామ ఆకులను అందులో వేసి చల్లారిస్తే, జామాకుల టీ తయారవుతుంది. ఇలా తయారుచేసిన టీకి పంచదార లేదా తేనె మిక్స్ చేసి తీసుకోవచ్చు. అయితే పాలను చేర్చకూడదు. ఈ టీతో ఎన్నో రకాల ఫలితాలను పొందొచ్చు. ఈ టీ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు అదుపులో ఉంటాయి. దీన్లోని పోషకాలకు బరువు తగ్గించే గుణం కూడా ఉంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగి బాధపడే వారు ఈ టీని నెలకోసారి తాగినా ఫలితం కనిపిస్తుంది. అజీర్ణ సమస్యలూ తగ్గుతాయి.


No comments:

Post a Comment