Tuesday 28 July 2015

చర్మం క్రింద కొవ్వుకరిగించే ఎఫెక్టివ్ ఆహారాలు

చర్మాన్ని రెండు వేళ్ళతో పట్టుకొని చూస్తే చర్మం దద్దురుగా కనిపించినపుడు దానిని సెల్యులైట్‌ అంటారు. చర్మం కింద పొరలో కొవ్వు చేరినపుడు ఈ స్థితి ప్రాప్తిస్తుంది. చక్కని శరీర సౌష్టవాన్ని ఇచ్చే వ్యాయామాలు చేయటం ద్వారా సెల్యులైట్‌ని కనిపించకుండా చేయవచ్చు. అలాగే తెల్లటి మేని ఛాయ కలిగినవారి కంటే నలుపు రంగు చర్మం కలిగిన
వారికి సైల్యులైట్‌ అంతగా కనిపించదు. కాబట్టి మీరు బాగ తెల్లగా ఉంటే, మీకు సెల్యులైట్‌ అనేది ప్రధాన సమస్యగా ఉంటే కొంచెం ఎండతగిలేలా చేసి నల్లబడడానికి ప్రయత్నించండి. కొన్ని సౌందర్య చికిత్సా పద్ధతులు అలాగే ఔషధాలు సెల్యులైట్‌ని తగ్గించటం కోసం ఉన్నప్పటికీ ఇవి ఏ మేరకు ఫలితాన్నిస్తాయన్నది ప్రశ్నార్థకమే. పైగా వీటితో ప్రమాదాలు ఉండనే ఉన్నాయి.
సన్ రాషెస్ ను నివారించడానికి 8 నేచురల్ రెమెడీస్ ఈ సెల్యులైట్ సమస్య స్త్రీలలో మాత్రమే కాదు, పురుషుల్లో కూడా ఉన్నది. అయితే పురుషులతో పోల్చితే స్త్రీలలోనే ఎక్కువ . ఇది శరీరంలో ఫ్యాట్, మరియు జన్యు సంబంధ, ఈస్ట్రోజెన్ స్థాయిలు మరియు కొన్ని మెడికల్ కండీషన్స్ మరియు సరైన ఇన్సులిన్ లెవల్స్ లో అసమానతలు వల్ల ఈ సెల్యులైట్ ఏర్పడటానికి ప్రధాణ కారణాలు .ఇంకా ఒత్తిడి కూడా కారణమే . ఈ సెల్యులైట్ వల్ల చర్మం అసహ్యంగా..ఇబ్బంది కరంగా కనబడుతుంది. ముందుగా కాళ్లలో మరియు బ్యాక్ పోర్షన్ లో కనబడుతుంది మన శరీరంలో ఏభాగంలో అయిన కనబడవచ్చు.
స్కిన్ అలర్జీ లేదా చర్మం దురదను నివారించే హోం రెమెడీస్ మన శరీరంలో టాక్సిన్స్ ఏర్పటాకు ఇది ఒక లక్షణంగా గుర్తించాలి . ఈ క్రమంలో మీరు తీసుకొని ఆహారం ఈ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం.

No comments:

Post a Comment