Thursday 10 December 2015

ముక్కు పై చీకాకు పెట్టే మొటిమలకు చెక్క పెట్టే మార్గాలు

యుక్త వయసులో మొటిమలు రావడం సహజమే అయినప్పటికీ, మొటిమలు ఏర్పడగానే తాము అందవిహీనులమవుతున్నామని వారు భావిస్తారు. ముఖంలో మొటిమలను నివారించుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. వివిద రకాల చిట్కాలను ముఖం పాడు చేసుకుంటుంటారు. మరి ముక్కు మీద మొటిమలు
చిరాకుపెడుతుంటే ఏంచేయాలి?ముక్కు మీద మొటిమలను నివారించుకోవడం కొద్దిగా కష్టమైన పనే. మార్కెట్‌లో లభించే రకరకాల క్రీములను, లోషన్‌లను రాయడం, మొటిమలను గిల్లడం మొదలైనవి చేయడంవల్ల అవి తగ్గకపోగా ఇన్‌ఫెక్షన్‌కు గురై చీము కారడం మచ్చలు ఏర్పడడం, గుంటలు పడటం జరుగుతుంది. సాధారణంగా మొటిమలు 12 నుంచి 24 ఏళ్ల వయసు వరకూ వస్తుంటాయి. కానీ కొందరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడివల్ల, స్ర్తిలలో బహిష్టులు సక్రమంగా లేకపోవడంవల్ల, కొన్నిరకాల మందుల దుష్ప్రభావాలవల్ల వయస్సుతో నిమిత్తం లేకుండా ఇవి వస్తుంటాయి. మొటిమలు రాకుడా కొన్ని హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కాస్మోటిక్స్ వాడటమే కాదు, ఆహారం విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొటిమల నివారణకు చాలా చికిత్స పద్ధతులున్నాయి. అయితే మొటిమలు నయం కావడానికి కొంత సమయం పడుతుంది. చాలా వరకూ మొటిమల నివారణలో చికిత్స పద్ధతుల్లో రసాయనాలు అధికంగా వాడడం వల్ల ఒక సమస్యకు మరో సమస్యతోడవుతుంది. కాబట్టి రసాయన క్రీములు వాడటం కంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటించి చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అవి ఖచ్చితంగా మీ వంటగదిలోనే సులభంగా దొరికేటటువంటి వస్తువులతోనే మొటిమలు నయం చేసుకోవచ్చు. 

No comments:

Post a Comment