Wednesday 23 December 2015

బెంగాలీ వధువు తప్పక ఈ ఐదింటినీ ధరిస్తుంది...

ఇది పెళ్ళిళ్ళ సీజన్. పెళ్ళిళ్ళల్లో ధరించే దుస్తుల గురించి మనం ఇప్పుడు సీరియస్‌గా మాట్లాడుకుందాము. మేము ఇదివరకే మహారష్ట్రియం అమ్రియూ దక్షిణ భారత దేశపు వధువులు పెళ్ళిలో ధరించే దుస్తుల గురించి వివరించాము.
ఇక ఈరోజు బెంగాలీ వధువుల వంతు.బెంగాలి వధువులంటే చెంపకి చారెడేసి కళ్ళు ఉన్నవారు అని ప్రసిద్ధి.వధువుల్లో అత్యంత అందగత్తెలుగా కొనియాడబడే రాజస్థానీ వధువుల తరువాతి స్థానం బెంగాలీ వధువులదే.బెంగాలీ వధువులకుండే మీనాల్లాంటి కళ్ళు, వారి గోధుమరంగు చర్మం వారిని అధ్భుత సౌందర్య రాశులుగా నిలుపుతాయి.బెంగాలీ వధువులు ఢిల్లీ,దక్షిణ భారత దేశపు వధువుల మధ్య కోవకి చెందుతారు.వీరు ఢిల్లీ వధువుల లాగ మరీ గాడీగా ఉండరూ లేదా దక్షిణ భారత్ దేశపు వధువుల వలే మరీ సింపుల్‌గానూ ఉండరు.బెంగాలి వధువులలో హైలైట్ వారి మేకప్.కాటుక దిద్దిన వారి కళ్ళు,గంధపు పొడితో వారి నుదుటి మీద జాగ్రత్తగా తీర్చిదిద్దిన డిజైన్లు వీరి మేకప్‌లో ముఖ్య ఆకర్షణ.ఈ మేకప్ బెంగాలీ వధువులకున్న చక్కటి ముఖకవళికలు హైలైట్ అయ్యి వారు మరింత అందంగా కనిపించేటట్టు చేస్తుంది.ఇక బెంగాలీ వధువు ధరించే దుస్తుల విషయానికొస్తే వీరి దుస్తులు మిగతా వధువుల వలే ఉన్నా కూడా ఒక ప్రాంతానికీ మరొక ప్రాంతానికీ ఉన్న సంస్కృతి భేదం వల్ల వధువు ధరించే దుస్తుల్లో కాస్త భేదముండచ్చు.భారీ బంగారపు బోర్డర్ ఉన్న ఎర్రటి బెనారస్ చీర ధరిస్తుంది బెంగాలీ వధువు. ఎరుపురంగు హిందూ సంప్రదాయంలో మంగళకరంగా భావించడం వల్ల చాలా మంది వధువులు ఎర్రటి చీర ధరించడానికి మొగ్గు చూపినా కొంతమంది పింక్ లేదా నారింత రంగు చీరలు కూడా ధరిస్తారు.ఇక ఒక్క నిమిషమయినా వృధా చెయ్యకుండా బెంగాలి వధువు తప్పక ధరించే 5 ఆభరణాలేమిటో చూద్దామా: బంగారపు ముక్కు పుడక: దీనిని బంగారంతో చేస్తారు. ఈరోజుల్లో వధువులు దీనిని పెద్దగా ధరించట్లేదు కానీ సంప్రదాయబద్ధంగా చూస్తే ఇది చాలా ముఖ్యం. టిక్లీ: ఇది పాపిట బిళ్ళ లాంటిది. దీనిని వధువు నుదుటి మధ్య భాగంలో ఎర్రటి బొట్టు పైన ధరిస్తుంది.దీనినే కొన్ని ప్రాంతాల్లో మాంగ్ టిక్కా అని అంటారు. టియారా లేదా మకుట్: ఇది ధరించనిదే బెంగాలి వధువు మేకప్ పూర్తి కాదు.ఇది తెల్లగా ఉండి దీని మీద సన్నటి డిజన్ చెక్కబడి ఉంటుంది. దీనిని టిక్లీ కి పైభాగంలో ధరిస్తారు. నీర్ డోల్ లేదా జూకాలు: ఈ భారీ చెవి రింగులు వధువు తన బెనారస్ చీరతో పాటు ధరించాలి. గంధపు పొడి మేకప్: బెంగాలీ వధువు లుక్ కి ఈ మేకప్ చాలా ముఖ్యం.ఎర్రటి బొట్టు చుట్టూ గంధపు పొడితో తెల్లటి చక్కని డిజైన్లు వేస్తారు.ఈ మేకప్ తరువాత బెంగాలి వధువు ఒక అధ్భుతంలా కనిపిస్తుంది.

No comments:

Post a Comment