Tuesday 15 December 2015

అరచేతిలో గోరింట.. ఎర్రగా విరబూయాలంటే

ఇండియన్ వెడ్డింగ్స్ లో మెహందీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. పెళ్లికూతుళ్ల అలంకరణలో మెహందీ చాలా కీలకం. చేతులనిండా, కాళ్లనిండా మెహందీ డిజైన్లలలో పెళ్లికూతురు అందం మరింత రెట్టింపు అవుతుంది. నగలు, పట్టుచీరలు ఎంత ముఖ్యమో వధువుకి వన్నె తెచ్చే గోరింటాకు కూడా అంతే ముఖ్యమని భారతీయ పెళ్లిళ్లు
చెబుతాయి. ఒకప్పుడు పెళ్లిళ్లలో ఇంట్లోనే గోరింట ఆకు తీసుకొచ్చి పేస్ట్ చేసి అందరూ అరచేతిలో డిజైన్స్ పెట్టుకుని మురిసిపోయేవాళ్లు. కానీ ఇప్పుడు అంత తీరిక లేక, బిజీ షెడ్యూల్స్ ఉండటంతో.. రెడీమేడ్ కోన్ లకు ఎక్కువ క్రేజ్ పెరిగిపోయింది.
హెన్నా (గోరింటా)ఆకులు యొక్కఆరోగ్య ప్రయోజనాలు వివాహ వేడుకల్లో మెహంది పెట్టుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. పెళ్లికూతురు సిరి సంపదలు పొందాలని కోరుకుంటూ.. ఇలా మెహంది పెడతారు. పెళ్లికి ముందు రోజు ఈ మెహంది సెర్మనీ నిర్వహిస్తారు. అలాగే మెహందీ బాగా ఎర్రగా పండిందంటే.. తన భర్త ఎక్కువ ప్రేమిస్తాడని ఒక నమ్మకం కూడా ఉంది. కాబట్టి పెళ్లికూతుళ్లకు గోరింటాకు ఎర్రగా పండాలంటే.. సింపుల్ టిప్స్ ఫాలో అయితే సరి.

No comments:

Post a Comment