Thursday 17 December 2015

బొద్దులోనూ బోలెడంత అందాన్ని చూపించే ట్రెండీ ఐడియాస్

లావుగా ఉన్న అమ్మాయిలు డ్రెస్ ఎంపిక చేసుకునేటప్పుడు, ట్రెండ్ ఫాలో అయ్యేటప్పుడు ఖచ్చితంగా కొన్ని రూల్స్ తెలుసుకోవాలి. మిమ్మల్ని మరింత లావుగా మార్చేసే ఎట్రాక్టివ్ ట్రెండ్స్ కి దూరంగా ఉండాలి. అంటే..
ట్రెండ్ ఫాలో అవుతూనే.. మిమ్మల్ని స్లిమ్ గా అందంగా చూపించే ట్రిక్స్ ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా ఫాలో అవండి.. అందరినీ ఆకట్టుకోండి. లావుగా ఉన్నామని ఎప్పుడో ఒకే స్టైల్ ఫాలో అవకండి. మీకు కూడా.. విభిన్నంగా డ్రెస్సింగ్ చేసుకునే అవకాశముంది. బొద్దులోనూ బోలెడంత అందముందని ఈ బోల్డ్ ఐడియాస్ మీకు వివరిస్తాయి. బొద్దుగా ఉన్నా.. చీరకట్టులో ముద్దుగా కనిపించాలంటే ? లావుగా ఉన్న అమ్మాయిలకు తరచుగా.. చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. పక్కనవాళ్లు ఇచ్చే ఉచిత సలహాలు విని విగుసు వచ్చేసింటుంది. కానీ.. లావుగా ఉన్న అమ్మాయిలకూ న్యూ ట్రెండ్స్ ఫాలో అవ్వాలని ఉంటుంది. కాబట్టి ట్రెండ్ కి తగ్గట్టు మీరు కూడా.. అందంగా మెరిసిపోయే ఐడియాలున్నాయి. సైజు, షేప్ గురించి మర్చిపోయి.. ఆకర్షణీయంగా కనిపించడానికి ఇప్పుడు ట్రెండీ దుస్తుల ఎంపికలో కొన్ని టిప్స్ మైండ్ లో పెట్టుకోవాలి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మిమ్మల్ని ఎట్రాక్టివ్ గా మార్చేస్తాయి. 

No comments:

Post a Comment