Tuesday 22 December 2015

కుంకుమ పువ్వులోని పసిడివర్ణపు సౌందర్య రహస్యాలు...

బ్యూటీ ప్రొడక్ట్స్ లో అద్భుతమైనటువంటి వస్తువు కుంకుమ పువ్వు. సౌందర్యానికి కుంకుమ పువ్వు ఉపయోగించడం వల్ల ముఖంలో గులాబీ మెరుపులు మెరవాల్సిందే. కుంకుమ పువ్వు ఒకరకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఈ భూభాగం లో అత్యంత ఆకర్షనీయమైనది , ఖరీదైనది , అద్భుత ఔషధ గుణాలు కలిగినది
కుంకుమపువ్వు. కుంకుమ పువ్వును ఇంగ్లీషులో శాఫ్రాన్‌ అంటారు. గర్భిణులు కుంకుమపువ్వు కలిపిన పాలు తాగితే పిల్లలు తెల్లగా పుడతార'ని అంటుంటారు. గర్భిణీ స్త్రీలు ప్రతిదినం కొద్దిగా కుంకుమ పువ్వును, పటిక పంచదార కలిపిన ఆవుపాలతో తీసుకుంటే పుట్టబోయే పిల్లలు మంచి తేజస్సుతో పుడతారని చాలా మంది భావన. ఇది అపోహేనని కొందరు కొట్టిపారేస్తారు. ఏది నిజమో కచ్చితంగా తెలియకపోయినా... రంగూరుచీవాసనా ఉన్న అరుదైన సుగంధద్రవ్యమే కుంకుమపువ్వు. అందుకే అది అందరికీ 'ప్రియమైన' ఎర్ర బంగారం..! ఇండియన్ ఉమెన్స్ ఫాలో అయ్యే టాప్ 10 అమేజింగ్ బ్యూటీ సీక్రెట్స్ కుంకుమపువ్వు సౌందర్యానికి, ఆరోగ్యానికీ కూడా ఉపయోగిస్తుంది. కుంకుమపువ్వు చర్మపు వర్చస్సును, కాంతిని పెంచుతుంది. చర్మానికి మంచి రంగును కలిగించి, చర్మపు సౌందర్యానికి తోడ్పడుతుంది. కుంకుమ పువ్వు రంగు పదార్ధంగాను, సువాసనకారిగాను అనేక తినుబండారాలు, తాంబూలంలోనూ వాడతారు. కుంకుమ పువ్వులో గొప్పఆరోగ్యప్రయోజనాలు కుంకుమ పువ్వు గంధంలా తయారుచేసి మొహానికి రాస్తే మొటిమలు తగ్గి, చర్మం సున్నితంగా ఆకర్షణీయంగా తయారవుతుంది. తాజా చర్మంతో ముఖం చర్మంలో మెరుపును తీసుకొస్తుంది. కాబట్టి కుంకుమ పువ్వుతో కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లు ఇంట్లోనే ఎలా తయారు చేసుకొని అప్లై చేయాలో తెలుసుకుందాం...

No comments:

Post a Comment