Monday 16 November 2015

వేడినీళ్ళతో శుభ్రపరచుకోవాలి:

వర్షాకాలం ప్రారంభమైతే చాలు...నీటిలోనే జీవనం..వర్షం వల్ల రోడ్లపైకి బురద వచ్చి చేరుతుంది. లేదంటే వర్షపు నీరు అంతా రోడ్ల మీద నిలిపోతాయి. రోడ్ల మీద పేరుకుపోయిన దుమ్ముధూళీ, వర్షపు నీటితో కలిసిపోయి, కాళ్లకు బురద
అటుకోవడంతో పాటు...ప్రమాదకరమైన క్రిములు సైతం మన పాదాల మీదకు చేరుకుంటాయి. వర్షాకాలంలో హెయిర్ ఫాల్ తగ్గించే ఇంటి చిట్కాలు... ఇంకా వర్షపు నీటిలో పాదు ఎక్కువగా నానడం వల్ల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలో కూడా పాదాల అందాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.
పాదాలను శుభ్రపరచుకోవడానికి గోరువెచ్చని నీరు మంచిది. సువాసనపూరితమైన యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుతో గోరువెచ్చని నీళ్లతో కాళ్లు కడుక్కోండి కాళ్లు కడిగాక నీరు దానంతట అదే ఆరుతుందంటూ అలా వదిలేయకండి. శుభ్రమైన పొడిబట్టతో పాదాలు తుడుచుకోవాలి. మరీ ముఖ్యంగా కాలివేళ్ల మధ్య తడి అంతా ఆరి పొడిబారేలా తుడుచుకోవాలి. లేకపోతే పాదాలు చెడటం మరింత ఎక్కువవుతుంది.

No comments:

Post a Comment