Saturday 17 May 2014

వెరైటీ చికెన్ వంటలు

సహజంగా శాకాహారంలో ప్రతి రోజూ రకరకాల తాజా గ్రీన్ లీఫీ వెజిటెబుల్స్ తో వంటలు వండుకొని తింటారు. అదే మాంసాహారులలైతే....?
వీరు మాత్రం ఎక్కువగా చికెన్, మటన్, ఫిష్ వంటివి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే మాంసాహారులు ఎప్పుడూ ఒక రకమైన వంటకాన్ని రుచి చూడం వల్ల కొంత బోరు అనిపించవచ్చు. అలా బోరు అనిపించే రుచులు కాకుండా, ఈ వీకెండ్ స్పెషల్ గా కొన్ని విభిన్నమైన రుచులకు మీ ముందుకు తీసుకొస్తోంది తెలుగు బోల్డ్ స్కై. కామ్. ఆదివారం అనగానే కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లో ఉంటారు. కాస్త స్పెషల్ వంటకాలు ఉండాలని అనుకుంటారు. మాంసాహారం తినేవాళ్లకైతే తప్పనిసరి ఆదివారం నాన్ వెజ్ ఉండాల్సిందే లేకపోతే వెలితిగా ఉంటుంది. మాంసంతో కూరలు వగైరా చేసుకోవడం తెలుసు కాని కాస్త వెరయిటీగా ఎలా తయారు చేయడమో చాలా మందికి తెలియదు. మాంసాహార ప్రియల్లో చాలా మందికి చికెన్ అంటే మహా ఇష్టం. చికెన్ కొవ్వుపదార్ధము తక్కువగా ఉండి పోషకాలు, మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. తేలికగా జీర్ణము అవుతుంది. కోడిమాంసము వేడి చేస్తుందని అనుకోవడం సరైనది కాదు... ఇది మంచి పౌష్టికాహారము. కాబట్టి పూర్తి ప్రోటీనులను అంధించే చికెన్ వంటలను వీకెండ్ స్పెషల్ గా మీ ముందు ఉంచుతున్నాము...

లగాన్ కా ముర్గ్ : 
స్పైసీ చికెన్ రిసిపి లగాన్ కా ముర్గ్ స్పైసీ మరియు టేస్టీ చికెన్ కర్రీ రిసిపి. ఇది ఒక మోస్ట్ పాపులర్ హైదరాబాదీ రిసిపి. వివిధ రకాల ఇండియాన్ మసాలా దినుసులతో తయారుచేసే ఈ హైదరాబాదీ చికెన్ రిసిపి మంచి ఫ్లేవర్ తో పాటు, అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. మసాలాలను ముందుగా వేయించుకొని మ్యారినేట్ చేయడం వల్ల అంత అద్భుతమైన రుచి ఫ్లేవర్ కలిగి ఉంటుంది. ఈ టేస్టీ అండ్ స్పైసీ రిసిపి తయారుచేయడానికి కొంత సమయం పడుతుంది.

No comments:

Post a Comment