Sunday 25 May 2014

మల్వాని చికెన్ : స్పైసీ కోస్టల్ కర్రీ

మీరు ఓల్డ్ ఇండియన్ చికెన్ రిసిపిలను తిని బోర్ అనిపిస్తోందా ?ఐతే మల్వాన్ చికెన్ రిసిపి మీకు ఒక కొత్త రుచిని అందిస్తోంది. మనలో చాలా మందికి మాల్వన్
రిసిపి కోస్టల్ రిసిపి అని తెలియదు. మల్వాని చికెన్ మహరాష్ట్ర మరియు గోవ వంటి కోస్టల్ ప్రాంతంలో ఎక్కువగా మనకు అందుబాటులో ఉండే చికెన్ రిసిపి. మల్వాని చికెన్ స్పెషల్ చికెన్ రిసిపి. మల్వాని చికెన్ స్పెషాలిటీ ఏంటంటే ఈ వంట పూర్తి కోస్టల్ ఫ్లేవర్ కలిగి ఉంటుంది. ఈ మల్వాని చికెన్ కర్రీని కొబ్బరి మరియు ఇతర కొన్ని మసాలా దినుసులతోటి తయారుచేస్తారు. ఈ చికెన్ కర్రీ రిసిపి మసాలా కూడా చేర్చి తయారుచేస్తారు. ఈ ఇండియన్ చికెన్ రిసిపిని తయారుచేయడానికి ముందుగా మసాలాపేస్ట్ తో మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత మసాలా, చివరగా గ్రేవీ...
కావల్సిన పదార్థాలు: మారినేషన్ కోసం : అల్లం: చిన్న ముక్క వెల్లుల్లి రెబ్బలు: 5 నిమ్మరసం: 2tbsp పచ్చిమిర్చి: 4 కొత్తిమీర : ఒక కట్ట నట్ మగ్ పౌడర్: 1tsp ఉప్పు : రుచికి సరిపడా ఈ పదార్థాలన్నింటి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ గ్రీన్ పేస్ట్ ను చికెన్ ముక్కలకు పట్టించి మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం : షా జీర: 1 tsp దాల్చిన చెక్కల: అంగుళం ముక్క మిరియాలు: 5 ఏలకులు: 2 స్టార్ యానిస్: 1 సొంపు:1 జాపత్రి:1 ఉల్లిపాయ: 4(సన్నగా తరిగినవి) అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp కొబ్బరి: 1cup(తురిమినది) చికెన్ : 500grm(మీడియం ముక్కలుగా కట్ చేసుకోవాలి) బే ఆకు: 1 కారం: 1tbsp ధనియాల పొడి:1tbsp గరం మసాలా పొడి: 1tbsp నూనె -4 tbsp ఉప్పు: రుచికి సరిపడా 
తయారుచేయు విధానం: 
1. ముందుగా డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక, అందులో షాజీర మరియు ఇతర మసాలా దినుసులన్నీ(దాల్చిన చెక్క, యాలకులు, పెప్పర్, స్టార్ యానిస్ మరియు జాపత్రి )వేసి ఫ్రై చేసుకోవాలి 
2. నూనెలో వేగుతున్నప్పుడు ఈ మసాలా దినుసుల యొక్క ఫ్లేవర్ మొత్తం చేరేంతవరకూ వేగించుకోవాలి.అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. 
3. 3,4నిముషాల తర్వాత కొబ్బరి తురుము కూడా వేసి, తక్కువ మంట మీద మరో 3,4నిముషాలు ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. 
4. తర్వాత వీటిని ఒక ప్లేట్ లోనికి తీసుకొని చల్లారనివ్వాలి . 
5. అంతలోపు, పాన్ లో ననూనె వేసి వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, మిగిలిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించుకోవాలి. 
6. ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ బ్రౌన్ కలర్ కు మారగానే అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి మరో రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి. 
7. తర్వాత అందులో ముందుగా మ్యారినేట్ చేసుకొన్న చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేసి మసాలా దినుసులతో బాగా మిక్స్ చేసి మీడియం మంట మీద 3,4నిముషాలు ఉడికించుకోవాలి. 
8. ఇప్పుడు అందులో ఉప్పు మరియు ఇతర మసాలా దినుసుల పొడులు, కారం, ధనియాల పొడి మరియు గరం మసాలా వేసి రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. 
9. ఇప్పుడు అందులో కొబ్బరి తురుము మరియు ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి నూనె పైకి తేలే వరకూ వేగించుకోవాలి. 
10. తర్వాత అందులో రెండు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి మరో 10నిముషాలు ఉడికించుకోవాలి. అంతే మల్వని చికెన్ రిసిపి రెడీ రోటి రైస్ కు మంచి కాంబినేషన్ .

No comments:

Post a Comment