Wednesday 28 May 2014

హాట్ అండ్ స్పైసీ ఫ్రైడ్ చికెన్ లెగ్స్

చైనీస్ ఫ్రైడ్ చికెన్ లెగ్స్ యమ్నీ అండ్ డెలిషియస్. ఈ రిసిపి చూడటానికి చికెన్ డ్రమ్ స్టిక్ లాగేఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం రెండూ వేరువేరుగా ఉంటాయి.
చైనీస్ ఫ్రైడ్ చికెన్ డ్రమ్ స్టిక్స్ చాలా రుచికంగా మరియు క్యాలరీలు కూడా అధికంగా ఉంటుంది. అందుకే చైనీస్ చికెన్ లెగ్ రిసిపి శరీర బరువును పెంచుతుంది. అయితే అదే చైనీస్ చికెన్ లెగ్స్ టేస్టీగా మరియు లో కాలరీలతో ఎలా తయారుచేయాలో బోల్డ్ స్కై మీకు వివరిస్తోంది. ఇక్కడ ఇస్తున్న చైనీస్ చికెన్ లెగ్స్ రిసిపి డీప్ ఫ్రై చేయకుండా స్టైర్ ఫ్రై అలాగే వేపించుకోవడం వల్ల కాలరీలు తక్కువగా ఉంటుంది. అదే విధంగా రుచికరంగా కూడా ఉంటుంది. డీప్ ఫ్రై చికెన్ లెగ్స్ కంటే ఫ్రై చేసిన చికెన్ లెగ్స్ రుచికూడా ఎక్కువగా ఉంటుంది.
కావల్సిన పదార్థాలు: చికెన్ లెగ్స్ : 4 వెనిగర్: 2tbsp వెల్లుల్లి రెబ్బలు: 5-6(సన్నగా తరగాలి) పచ్చిమిర్చి: 2(సన్నగా తరగాలి) సోయా సాస్: 1tbsp కార్న్ ఫ్లోర్: 1tbsp ఉల్లిపాయ: 1(సన్నగా చిన్నముక్కలుగా తరిగి పెట్టుకోవాలి) బెల్ పెప్పర్: 1(సన్నగా చిన్నముక్కలుగా తరిగి పెట్టుకోవాలి) చైనీస్ గ్రాస్: చిటికెడు నూనె: 2tbsp ఉప్పు: రుచికి సరిపడా 
తయారుచేయువిధానం: 
1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రం చేసి వెనిగర్, వెల్లుల్లిపేస్ట్ మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి 10నిముషాలు పక్కన పెట్టుకోవాలి. 
2. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సోయాసాస్, పచ్చిమిర్చి మరియు చైనీస్ గ్రాస్ వేసి బాగా మిక్స్ చేయాలి. 
3. తర్వాత చికెన్ లెగ్స్ ను సోయా మిక్సర్ లో డిప్ చేయాలి. వాటిని బయటకు తీసి కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండిలో వేసి పొర్లించాలి. 
4. అంతలోపు ఫ్రైయింగ్ పాన్ లో నూనెవేసి, స్టౌ మీద పెట్టి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చికెన్ లెగ్స్ ను అందులో వేయాలి. 5. మీడియం మంట మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
6. రెండు నిముషాల తర్వాత మంట తగ్గించి అందులో ఉల్లిపాయ ముక్కలు మరియు బెల్ పెప్పర్ ముక్కలు కూడా వేసి క్రిస్పీగా వేయించుకోవాలి. అంతే క్రిస్పీ చైనీస్ చికెన్ లెగ్స్ రెడీ. వీటిని డీప్ ఫ్రై చేయకూడదు.

No comments:

Post a Comment