Wednesday 21 May 2014

గార్లిక్ చికెన్ టేస్టీ అండ్ ఈజీ

చికెన్ అంటే నాన్ వెజిటేరియన్స్ అందరికీ చాలా ఇష్టమైన ఆహారం. చికెన్ చాలా సింపుల్ వంటకాలుగా కూడా తయారుచేసేస్తుంటారు.
అతి కొద్ది మసాలా దినుసలుతోటే తయారుచేస్తుంటారు. అలాతయారుచేసే చికెన్ వంటల్లో గార్లిక్ చికెన్ కూడా ఒకటి . రుచికరంగా ఉండే ఈ గార్లిక్ చికెన్ మంచి ఫ్లేవర్ కలిగి నోరూరిస్తుంటుంది . ఈ గార్లిక్ చికెన్ ను పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడుతారు. చాలా సులభంగా అతి తక్కువ సమయంలో తయారయ్యే ఈ గార్లిక్ చికెన్ ను మీరు కూడా టేస్ట్ చూడాలనుకుంటే తయారుచేసే పద్దతిని ఫాలో అవ్వండి...
కావల్సిన పదార్థాలు: చికెన్ థైస్ లేదా చికెన్ బ్రెస్ట్ : 1kg వెల్లుల్లి రెబ్బలు: 6(సన్నగా తరిగి పెట్టుకోవాలి) డ్రైడ్ థైమ్(వామ్ము): 3tsp ఆలివ్ ఆయిల్: 3tbsp నిమ్మరసం: 1పండు గ్రిల్ సీసనింగ్: 1tbsp ఉప్పు: రుచికి సరిపడా చికెన్ బ్రోత్: 1/2cup తయారుచేయు విధానం: 1. ముందుగా ఓవెన్ 450డిగ్రీలకు ప్రీహీట్ చేయాలి. తర్వాత చికెన్ ముక్కలను బేకింగ్ లేదా రోస్టింగ్ పాన్ లో పెట్టాలి. 2. చికెన్ ముక్కల మీద ఆలివ్ ఆయిల్. గ్రిల్ సీజనింగ్ మరియు థైమ్(వామ్ము)ను చిలకరించాలి. 3. తర్వాత గార్లిక్ పేస్ట్ ను కూడా చికెన్ ముక్కల మీద అప్లై చేయాలి మొత్తాన్ని బాగా మిక్స్ చేసి అరగంట ఓవెన్ లో బేక్ చేయాలి. 4. తర్వాత అందులో చికెన్ బ్రోత్ మరియు నిమ్మరసం కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. తిరిగి ఓవెన్ లో పెటి మరో 5నిముషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. 5. ఓవెన్ ఆఫ్ చేసిన తర్వాత మరో 5నిముషాలు అలాగే ఓవెన్ లో ఉంచాలి. తర్వాత బయటకు తీసి సర్వ్ చేయాలి అంతే గార్లిక్ చికెన్ విత్ థైమ్ రెడీ.

No comments:

Post a Comment