Sunday 4 May 2014

జుట్టు రాలడాన్నిఅరికట్టడానికి మార్గాలు

ప్రస్తుత రోజుల్లో పురుషుల్లోనే కాదు, మహిళలు కూడా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు . అయితే పురుషుల్లో వివిధ కారణాల వల్ల జుట్టు
రాలిపోతుంటుంది. అది కూడా వివిధ పాట్రన్స్ లో జుట్టురాలుతుంది. అయితే మహిళల్లో ఎక్కువగా తలలో మొత్తం భాగంలో జుట్టు పల్చబడటం, జుట్టు రాలడం, జుట్టు సాంద్రత తగ్గించడం వంటి సమస్యలున్నట్లు కంప్లైంట్స్ ఉన్నాయి. అందువల్ల జుట్టు రాలడానికి నిజమైన కారణాలను గుర్తించడం చాలా ముఖ్యం. సరైన టైమ్ లో గుర్తించినట్లైతే వెంటనే పరిష్కారం చూడవచ్చు. అది కూడా జుట్టుఎంత మేరకు నష్టపోయారో అన్నదాని మీద కూడా చికిత్స అవసరం అవుతుంది. అందుకు తగినపరిష్కారం కనుక్కోవచ్చు . జట్టు రాలడానికి అనేక కారణాలు దోహదపడుతుంటాయి. అయితే ముందుగా జుట్టు రాలడానికి కారణాలు తెలుసుకొని వాటి ఎలా అరికట్టాలో చూద్దాం...

కాలుష్యం ప్రభావం ఆధునిక జీవనశైలిలో జుట్టును పీడిస్తున్న సమస్య వాతావరణ కాలుష్యం. పొగ, ధూళి కారణంగా జుట్టు పొడిబారి నిర్జీవమవుతుంది. కుదుళ్లు బలహీన పడి జుట్టురాలి పోతుంది, ఉన్న వెంట్రుక కూడా బలహీనమై మధ్యలోకి తెగిపోతుంది. కాలుష్యం నుంచి రక్షణ: బయటకు వెళ్లేటప్పుడు జుట్టు కవర్ అయ్యేటట్లు క్యాప్ లేదా స్కార్ఫ్ వాడాలి. తలస్నానం చేయడానికి ముందు నూనెతో తలంటుకోవాలి. తలస్నానానికి శీకాయ, కుంకుడుకాయలను వాడాలి. అవి సాధ్యం కాకపోతే నాణ్యమైన షాంపూలను వాడాలి. Show Thumbnail


No comments:

Post a Comment