Thursday 12 December 2013

కనురెప్పలు బ్యూటిఫుల్ గా కనపించేందుకు మార్గాలు

ముఖంలో కళ్ళు చాలా అందమైన భాగం. కళ్ళు పెద్దగా, ఒక మంచి ఐలాష్ మరియు ఐబ్రోలున్నప్పుడు మరింత అందంగా కనబడుతాయి. అందుకే ఐ మేకప్ అంత పాపులర్ అయింది మరియు ట్రెండ్ లో ఉంది . ప్రసిద్ధ సెలబ్రెటీల నుండి కాలేజ్ గర్ల్స్ వరకూ అవదరూ వారి కళ్ళు అందగా కనబడేలా ఉండాలని కోరుకుంటారు. అందమైన కళ్ళు కలిగి ఉండాలంటే, మీరు ఐలాష్ మరియు ఐబ్రో మీద శ్రద్ద పెట్టాలి. కంటి అలంకరణ చాలా అవసరం. ఐ లాష్ మందంగా మరియు డార్క్ గా వేస్తే చాలా అందంగా ఉంటుంది. ఐలాష్ ను మందంగా మరియు బ్యూటిఫుల్ గా వేసుకోవడానికి కొన్ని మంచి బ్యూటీఫుల్ చిట్కాలాలున్నాయి. కాస్మోటిక్స్ ఉపయోగించి ఐలాష్ ను మందంగా వేయవచ్చు మరియు కొన్ని నేచురల్ మార్గంలో మందపాటి ఐలాష్ వేసుకోవచ్చు. కనురెప్పలకు మందంగా ఐలాష్ వేసుకోవడానికి అనేక మార్గాలున్నాయి. కానీ, కొన్ని అంత సమర్థవంతంగా ఉండవు మరియు కొన్ని మీ చర్మానికి మరియు కనురెప్పల వెంట్రుకల రకంకు అనుగుణంగా ఉండకపోవచ్చు. ఐలాష్ ను మందంగా వేసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలు అత్యంత సమర్థవంతమైనవి మరియు ఎక్కువ ఉపయోగించవబడినవి ఈ క్రింది విధంగా వివరించబడ్డాయి. కనురెప్పలు బ్యూటిఫుల్ గా కనపించేందుకు మార్గాలు ADVERTISEMENT 1 . మస్కరా: మీరు డేట్ కోసం లేదా పార్టీ కోసం బయట వెళుతున్నప్పుడు మీకు ఒక మందపాటి ఐలాష్ తక్షణం వేసుకోవాలంటే, మంచి మన్నికైన మస్కరాను ఉపయోగించడం ఉత్తమమైన పద్దతి. ఐలాష్ మందగా కనిబడుటకు మహిళల కోసం మస్కరా ఒక బ్యూటీ టిప్.ఇది చాలా సమర్థవంతంగా మరియు ప్రజాదరణ పొందిన పద్ధతి. మస్కరా వివిధ రకాల్లో పొడవు మరియు పొట్టి ఐలాష్ లుగా దొరుకుతుంది. ఇంకా ఇవి వివిధ రంగుల్లో లభ్యమవుతున్నాయి . అందువల్ల , తక్షణం మస్కరా వేసుకోవాలంటే అది ఎక్కువ సమయం నిలిచి ఉండాలంటే మస్కరా ఉత్తమమైన ఐలాష్ .2 . నకిలీ కనురెప్పలు - మీరు మీ కనురెప్పలకు మందపాటి ఐలాష్ ను వేసుకోవాలనుకొన్నప్పడు, కళ్ళను చాలా పెద్దగా చూపించాలనుకొన్నప్పడు పొడవాటి, ఐలాష్ ను ఉపయోగించండి. ఇది చూడటానికి నకిలి అనిపించిన, వాటికి మందంగా ఐలాష్ వేసిన తర్వాత అందంగా కనబడుతాయి . మీ ఐలాష్ ను మందగా చూపించడానికి ఇది ఒక తక్షణ పద్దతి. కనురెప్పలకు ఎక్స్ టెన్షన్ గా బ్యూటీ స్టోర్స్ లో అందుబాటులో ఉన్నాయి. అంతే కాదు, వీటిని వి విధ రకాల్లో కనుగొనబడినవి. బ్యూటీ టిప్ ఏంటంటే వీటిని చాలా సాధారణంగా ఉపయగించాలి. 3 . మాయిశ్చరైజ్: కనురెప్పలకు, అదే విధంగా కనుబొమ్మలకు వాజిలిన్ రాయడం వల్ల అవి మరింత మందంగా కనబడేలా చేస్తుంది మరియు నేచురల్ గా నల్లగా కనబడుతాయి. ఐలాష్ మందంగా కనబడటానికి ఎక్కువ సమయం తీసుకొని మేకప్ వేసుకవాలి. కానీ, కనురెప్పలను మందంగా చేసుకోవడానికి ఇది ఒక శాశ్వత పరిష్కారం . 4 . నూనెలు - వివిధరకాల నూనెలు, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె మొదలగునవి మీ కనురెప్పలకు అప్లై చేసి మసాజ్ చేయవచ్చు . ఈ నూనెలు కనురెప్ప మొదల్ల వద్ద ఉద్దీపనగావించి, కనురెప్పల వెంట్రులక పెరగడానికి సహాయపడుతాయి. కనురెప్పలను, కనుబొమ్మలను ఈ నూనెలో ఉపయోగించి మద్యమద్యలో గ్యాప్ ఇస్తు మసాజ్ చేస్తుండాలి. దాంతో కనురెప్పల వద్ద, కనుబమ్మల్లో వెంట్రుకలు పెరుగదలను పెంచుతుంది . కనురెప్పలను మందంగా మార్చుకోవడానికి ఇది ఒక శ్వాశత పరిష్కారం . ఇది ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఓపికగా ఈ పద్దతిని అనుసరించాలి . మందపాటి కనురెప్పలను పొందడానికి ఒక మంచి పరిష్కారం ఎటువంటి కాస్మోటిక్స్ ఉపయోగించకుండా పెంచుకోవడమే. 5 . రుద్దడం ఆపాలి: కనురెప్పలను అప్పుడప్పుడు చేతులతో రుద్దుతుంటాం. ఇలా చేయడం వల్ల కనురెప్పలకున్న వెంట్రులకు బ్రేక్ అయ్యి, రాలిపోతుంటాయి . దాంతో కనురెప్పలు కానీ, కనుబొమ్మలు కానీ మందంగా కనిపించవు, మరింత పల్చగా కనబడేలా చేస్తాయి . ఇది నివారించాలంటే ఎప్పుడు కనురెప్పలను రుద్దకూడదు. మహిళలు మందపాటి ఐలాస్ కోరుకుంటున్నట్లైతే ఇది ఒక బ్యూటీ టిప్ . ఈ మందంగా మరియు అందమైన వెంట్రుకలు కలిగి కొన్ని చిట్కాలు ఉన్నాయి . మహిళలకు ఈ అందం చిట్కాలు చాలా సహాయకారిగా మరియు ఉపయోగకరంగా ఉంటాయి . ఐ మేకప్ మరియు కంటి అందం ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనది . చిక్కటి వెంట్రుకలు మీ మొత్తం లుక్ మార్చవచ్చు మరియు మీ కళ్ళు మరియు ముఖం మరింత అందమైనదిగా చెయ్యవచ్చు.

No comments:

Post a Comment