Tuesday 3 December 2013

ఆరోమా చికెన్ కోరియాండర్ రిసిపి

ఈ సీజన్ లో గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తో పాటు, గ్రీన్ కోరియాండర్ లీవ్స్ కూడా మార్కెట్లో మనకు అందుబాటులో ఉంది. కొత్తిమీరు ఖరీదు తక్కువ, ఎప్పడు ఒక కట్ట కొత్తిమీర తెచ్చినా ఎంతో కొంత వేస్ట్ అవుతూనే ఉంటుంది. చట్నీ, కర్రీలకు
ఉపయోగించిన తర్వాత మిగిలింది ఫ్రిజ్ లో పెట్టుకొన్ని కొన్ని రోజుల తర్వాత అది చెడిపోయి, వేస్ట్ అవుతుంది. చట్నీ, కర్రీలకు మాత్రమే కాకుండా కొంచెం స్పెషల్ గా గ్రేవీలకు ఉపయోగించుకోవచ్చు. చిక్కటి గ్రేవీ అద్భుతమైన రుచిని మాత్రమే కాదు, కొత్తిమీర ఫ్లేవర్ తో క్రీమీగా టేస్ట్ గా ఉంటుంది. మరి మీరు కోరియాండర్ ప్లేవర్ తో ఎలా తయారుచేయాలో మీరు క్రింద విధంగా తయారుచేసే పద్దతిని చూండండి...

కావల్సిన పదార్థాలు మ్యారినేషన్ కోసం: 
చికెన్ బ్రెస్ట్: 3(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లం పేస్ట్: 1tsp వెల్లుల్లి పేస్ట్: 1tsp నిమ్మరసం: 2tsp పెరుగు: 2tsp ఉప్పు: 1/2tsp గ్రేవీ కోసం: నూనె: 3tbsp ఉల్లిపాయ: 2cup(సన్నగా కట్ చేసుకోవాలి) ధనియాల పొడి: 1tbsp కొత్తిమీర: 2cups పచ్చిమిర్చి: 2-3 గరం మసాలా: 1tsp ఉప్పు రుచికి సరిపడా 

తయారుచేయు విధానం: 
1. మ్యారినేషన్ కోసం సిద్ధం చేసుకొన్న పదార్థాలన్నింటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని మిక్స్ చేయాలి. తర్వాత రిఫ్రిజరేటర్ లో 4-8గంటల పాటు పెట్టి. 
2. తర్వాత ఒక మందపాటి పాన్ స్టౌ మీద పెటి, అందులో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి, ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. 
3. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ లోకి మారిన తర్వాత అందులో ధనియాల పొడి వేసి మిక్స్ చేస్తూ, అరనిముషం ఫ్రై చేసుకోవాలి . 
4. తర్వాత అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను వేసి ఫ్రై చేయాలి. 
5. ఎక్కువ మంట పెట్టి ఉడికిస్తూ ప్రై చేయాలి. మద్య మద్యలో కలియబెడుతుండాలి. 
6. ఇప్పుడు మిక్సీలో కొత్తిమీరను మరియు పచ్చిమిర్చిని వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. 
7. కొత్తమీర పేస్ట్ ను ఇప్పుడు ఉడుకుతున్న చికెన్ లో వేయాలి. 
8. చికెన్ ముక్కలు కొత్తిమీర పేస్ట్ తో బాగా మిక్స్ అయ్యే వరకూ కలియ బెట్టి, తర్వాత 10-15 పాటు చికెన్ మెత్తగా ఉడికించుకోవాలి.

No comments:

Post a Comment