Thursday 5 December 2013

స్పైసీ ఆలూ - దొండకాయ మసాలా

దొండకాయ చాలా అరుదుగా చేస్తుంటారు. అయితే ఇది సంవత్సరం అంతా విరివిగా దొరుకుతుంది. దొండకాయలో బీటాకెరోటిన్, అధిక ప్రోటీన్స్ మరియు ఫైబర్ ను కలిగి ఉంటుంది. దొండకాయను మధుమేహగ్రస్తులు తీసుకోవడం చాలా ఆరోగ్యకరంమని ఒక వైద్య అధ్యయనంలో పేర్కొన్నారు. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, హెల్తీ కూడా. ఇందులో కార్బోమైడ్రేట్స్, విటమిన్ ఎ మరియు సిలు, వింటర్లో మీలో రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా అవసరం అవుతాయి . బంగాళదుంపను మనం వివిధ రకాలుగా తయారుచేసుకుంటాం. అలాగే దొండకాయను కూడా వివిధ రకాలుగా తయారుచేస్తాము. ఫ్రై చేసిన, పనీర్ లేదా చికెన్ తో స్టఫ్ చేసినా అద్భుతంగా ఉంటుంది. ఇటువంటి నోరూరించే వంటనే మీకు మరోకటి పరిచయం చేస్తున్నాం. ఈ వంట నిజంగా చాలా రుచికరంగా ఉంటుంది . ఈ వంటకు వివిధ రకాల మసాలా దినుసులు జోడించి చేయడం వల్ల చాలా అద్భుతమైన రుచిని అంధిస్తుంది. మరి దీన్ని మీరు ట్రైచేయండి...

కావల్సిన పదార్థాలు: 
దొండకాయ: 500gms(మీడియం సైజ్ ముక్కులుగా కట్ చేయాలి) 
బంగాళ దుంపలు : 4 (మద్యకు కట్ చేయాలి) ఉల్లిపాయ పేస్ట్ 4tbsp అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp పెరుగు: ½cup పసుపు: 1tsp కారం: 2tsp జీలకర్ర పొడి: 1tbsp ధనియాల పొడి: 1tbsp గరం మసాలా పొడి: 1tsp పంచదార: చిటికెడు హింగ్ (ఇంగువ): చిటికెడు ఉప్పు: రుచికి సరిపడా జీలకర్ర: 1tsp చెక్క: 1 యాలకులు: 3 బే ఆకు : 1 ఆయిల్: 2tbsp నెయ్యి: 1tsp నీళ్ళు: 1cup
తయారుచేయు విధానం: 1. ముందుగా బంగాళదుంపలు మరియు దొండకాయలను నీళ్ళతో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో బంగాళదుంప మరియు దొడకాయ ముక్కలు వేసి, కొద్దిగా ఉప్పుకూడా వేసి ఫ్రై చేసుకోవాలి. 3. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారగానే వాటిని ఒక ప్లేట్ లోనికి తీసి పక్కన పెట్టుకోవాలి. 4. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో జీలకర్ర, ఇంగువ, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు వేసి, 2, 3నిముషాలు వేగించుకోవాలి. 5. తర్వాత అందులో ఉల్లిపాయ సేప్ట్ వేసి 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి 6. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, జీలకర్ర, ధనియాల పొడి వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి. 7. పెరుగులో పంచదార వేసి బాగా మిక్స్ చేయాలి . ఈ పెరుగు మిశ్రమాన్ని ఫ్రైయింగ్ పాన్ లో వేసి, మసాలా మిశ్రమంతో పాటు వేగించాలి. 8. ఇప్పుడు అందులో ముందుగా వేగించిపెట్టుకొన్న బంగాలదుంప, దొండకాయ ముక్కలు కూడా వేసి నిధానంగా కలుపుతూ, వేగించుకోవాలి. 9. తర్వాత అందులో ఉప్పు కూడా చేర్చి మరో రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి . తర్వాత అందులో నీళ్ళు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. 10. ఇప్పుడు పాన్ మూత పెట్టి, మీడియం మంట మీదు నిధానంగా ఉడికించుకోవాలి. 11. బంగాళదుంప, దొండకాయ మెత్తగా ఉడికిన తర్వాత అందులో గరం మసాలా పౌడర్, నెయ్యి వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే స్టౌ ఆఫ్ చేసి సర్వ్ చేయాలి. అంతే అద్భుతమైన రుచికలిగిన ఆలూ దొండకాయ సబ్జీ రెడీ. ఈ రుచికరమైన కర్రీని రోటిలకు మంచి కాంబినేషన్.

No comments:

Post a Comment