Monday 30 December 2013

వింటర్ హెయిర్ కేర్ టిప్స్ ఫర్ బ్యూటిఫుల్ హెయిర్

ఈ కాలంలో పొడిజుట్టు మరింతగా పొడిగా తయారవుతుంది. స్టీమ్‌ హీట్‌ వాడినా లేదా బయట ఎక్కువసేపు తిరిగినా జుట్టు మరింత పొడిబారుతుంది. అధికంగా షాంపు చేసుకోకుండా
ఉండడం మంచిది. నరిషింగ్‌ షాంపూల్ని వాడాలి. కండీషనర్లు వాడితే ఫలితం కనిపిస్తుంది. షాంపు చేసుకున్న ప్రతిసారీ కండిషనర్‌ వాడుతుంటే జుట్టు మృదువుగా మెరుస్తుంది. మెరుపును పెంచే సెరం లేదా క్రీమ్‌లను ఉపయోగించాలి. తలస్నానం తర్వాత జుట్టును డ్రయ్యర్‌ ద్వారా కాకుండా సహజంగా ఆరబెట్టుకోవాలి. ఏ మందుల షాపునకు వెళ్లినా, సూపర్‌మార్కెట్లకు వెళ్లినా ముఖానికి, శరీరానికి, కళ్లకు, చేతులకు, గోళ్లకు రకరకాల క్రీమ్‌లు, లోషన్లు జెల్‌లు దర్శనమిస్తున్నాయి. మరి శిరోజాల సంగతేంటి? మాడు చికిత్సలు, హెడ్‌మసాజ్‌లు, లీవ్‌ ఇన్‌ క్రీమ్స్‌ అన్నీ ప్రభావవంతంగానే పనిచేస్తాయి. రాత్రివేళ పడుకునే ముందు తలకు చికిత్సలు బాగా ఉపకరిస్తాయి. సమయంలో విశ్రాంతిగా ఉంటారు. మురికి జిడ్డు పగటివేళ మిరుమిట్లు గొలిపించే లైటింగ్‌ బెడద, సూర్యకిరణాల తాకిడి ఇవేమీ అస్సలు ఉండనే ఉండవు. అన్నింటికీ మించి శిరోజాల పట్ల తగినంత శ్రద్ధ చూపగల సమయమూ ఉంటుంది. శరీరమూ,శిరోజాలు కూడా ఎటువంటి స్ట్రెస్‌ లేకుండా ఉండి, రాత్రివేళ చికిత్సలకు అనకూలంగా ఉంటాయన్న సంగతిని గుర్తించాలి. రాత్రివేళ పడుకునే ముందు తలను వందసార్లు దువ్వెనతో దువ్వుకుంటామని అమ్మమ్మలు, నాన్నమ్మలు చెప్పే మాటల్ని గుర్తుచేసుకోవాలి. చాలామంది ఈ మాటల్ని కేవలం అపోహ మాత్రమే అని కొట్టివేస్తారు. అయితే ఇది ప్రభావవంతమైన రొటీన్‌ అని పరిశోధనలు పేర్కొంటు న్నాయి. దీనివల్ల మాడుకు చక్కని మసాజ్‌ చేసినట్లు అవుతుంది. మృత కణాలు తొలగిపోయి, జుట్టు పట్టుకుచ్చులా మాదిరి మెరుస్తూ చిక్కులు పడకుండా ఉంటుంది. విభిన్న స్ట్రోక్స్‌ రాత్రికి రాత్రి శిరోజాల రక్షణ అన్నది ఒకప్పుడు కొత్త కాన్సెప్ట్‌గా మారింది. అనేక కొత్తకొత్త ఉత్పత్తుల్ని కనుక్కోవడం వల్ల ఈ రంగంలో నూతన దృక్పథం, జిజ్ఞాస పెరిగాయి. తలకు నూనెపెట్టి మసాజ్‌ చేసిన ప్పుడు శరీరం విశ్రాంతిగా ఉన్నప్పుడు శిరోజాలకు చక్కని తేమ, కండీషనింగ్‌ లభిస్తుంది. నిద్రించడానికి ముందువేళ్లతో సింపుల్‌గా మాడును మసాజ్‌ చేసుకున్నా శిరోజాల మాడుకణాల్ని ఉద్దీప్తం చేసి, కొత్త కణాల ఉత్పత్తికి సహకరిస్తుంది. అలాగే, జుట్టు రాలకుండా క్రీమ్‌లు, ఎనర్జీ సెరంలాంటి వాటిని రాత్రివేళ రాస్తేనే ఫలితం ఎక్కువని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని రకాల ఓవర్‌ నైట్‌-యూజ్‌ సెరమ్స్‌(మార్కెట్‌లో లభిస్తాయి) పొడిబారిన, చిట్లిన వెంట్రుకల మరమ్మతులకు సహకరిస్తాయి. చాలామంది చర్మం పట్ల చూపిన శ్రద్ధలో ఓ వంతు కూడా జుట్టుపట్ల చూపరు. ఇంట్లోనే చికిత్సలు చేసుకునే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం వహిస్తారు. ఒక టీస్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, ఒక టీస్పూన్‌ గ్లిజరిన్‌, రెండు మూడు చుక్కలు లావెండర్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌, పావు టీస్పూన్‌ వెనిగర్‌ కలిపి మాడు నుంచి, శిరోజాల కొసలదాకా అప్లయి చేయాలి. జుట్టు రఫ్‌గా, పొడిగా ఉన్నవారికి బాగా ఉపకరిస్తుంది. ఇవన్నీ కూడా శిరోజాలకు పోషకాలను ఇచ్చే పదార్థాలే. ఈ మిశ్రమాన్ని రాసి రాత్రంతా అలా వదిలేసి ఉదయాన్నే షాంపు చేసుకోవాలి. రాత్రివేళ అతిగా ఉత్పత్తుల్ని అలాగే ఉంచేసి పడుకోవడం మంచిది కాదు. ముఖంపై మేకప్‌ను ఏవిధంగా క్లీన్‌ చేసుకుని పడుకుంటారో అదే మాదిరి మాడునూ శుభ్రం చేసుకోవాలి. పగటివేళ ఏవైనా హెయిర్‌ ప్రొడక్ట్‌ను వాడినట్లయితే పడుకునే ముందు శిరోజాల్ని బాగా బ్రెష్‌ చేయాలి. లేదా క్విక్‌ వాష్‌ చేసుకుని, పరిశుభ్రమైన మాడుతో నిద్రకు ఉపక్రమించాలి. కలర్‌ చేసినా లేదా ఏవిధంగానైనా కెమికల్‌ ట్రీట్‌మెంట్స్‌ చేయించుకున్నా అది ఆక్సిడైజ్‌ అవుతుంది. అలాగే విభిన్నవాసనలు, జిడ్డు, పగటివేళపడే దుమ్ము తాలూకు మురికి తలలో అలాగే ఉండిపోతే జుట్టు రాలిపోవడానికి దారితీస్తుంది. ఆయిలింగ్‌ నైట్‌కేర్‌ రొటీన్‌లో మంచి ఆయిలింగ్‌ ప్రక్రియ ఉండాలి. రెండు మూతల అరోమాథెరపి ఆయిల్‌ను ఆలివ్‌ లేదా ఆల్మండ్‌ ఆయిల్‌తో కలిపి మసాజ్‌ చేసుకోవాలని, రాత్రంతా అలా వదిలేసి మర్నాడు షాంపు చేసుకోవాలని శిరోజాల నిపుణులు సూచిస్తున్నారు. సాదా కొబ్బరినూనె కూడా వాడవచ్చు. అయితే అవసరానికి మించి అతిగా నూనె పెట్టవద్దు. ఇలా నూనెపెడితే, మరునాడు దానిని వదిలించుకోవడానికి ఎక్కువ షాంపు వాడాల్సి వస్తుంది. దీనివల్ల జుట్టు డ్రైగా అయిపోతుంది. అప్పుడు పొడిజుట్టును అనువుగా మలుచుకోవాలన్న ప్రధాన ఉద్దేశ్యమే దెబ్బతింటుంది. రాత్రి పడుకునే ముందు జుట్టును పరిశుభ్రంగా ఉంచుకోవాలి కదా అని, తలస్నానం చేసేసి తడిజుట్టుతో పడుకోకూడదు. తేలికపాటి, నీటి ఆధారిత మాయిశ్చరైజింగ్‌ లీవ్‌-ఇన్‌ కండిషనర్‌ ఓవర్‌నైట్‌ను వారానికి రెండుసార్లు వాడడం మంచి ప్రత్యామ్నాయం. నాణ్యమైన నైట్‌రిపేర్‌ క్రీమ్‌, జిడ్డులేని కొబ్బరినూనె, రోజ్‌మేరీ ఆయిల్‌, జొజోబా ఆయిల్‌, కొబ్బరిపాల ప్రొటీన్‌, విటమిన్‌ బి5 వాడాలి. ఇవి మాడులో రక్తప్రసరణను పెంచుతాయి. శిరోజాలకు ప్రొటీన్‌ అందించి, జుట్టును జిడ్డుగా మార్చే అదనపు సెరం విడుదలను తగ్గిస్తాయి. చుండ్రు అవకాశాల్ని కూడా తగ్గిస్తాయి.


No comments:

Post a Comment